ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాతో పాటు మరో 13 మందిపై 4996 పేజీల ఛార్జిషీట్‌ను ముంబయి పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతోందని కోర్టుకు తెలిపారు.
సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు అవకాశాలిస్తామని చెప్పి, ఫోర్న్ వీడియోల్లో నటింపజేస్తున్నారని, వాటిని పలు యాప్‌ల ద్వారా ప్రసారం చేస్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి మొత్తం 9 మందిని దోషులుగా తేల్చారు. వారిపై 3529 పేజీల ఛార్జిషీట్ తయారు చేసింది.
ఆ తర్వాత పోర్న్ మూవీస్‌కు సంబంధించిన రాజ్‌కుంద్రా ఆఫీసుల్లో పలు ఆధారాలు దొరకడం వల్ల అతడిని ఈ ఏడాది జులై 19న అరెస్టు చేశారు.
ఈ వీడియోలు పలు వెబ్సైట్, యాప్‌లకు విక్రయించడం ద్వారా ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు లక్షల్లో సంపాదించారని పోలీసులు తెలిపారు. కేసులో కీలకమైన వాట్సాప్, ఈ-మెయిల్స్ తదితర సాక్ష్యాలను నిందితులు ధ్వంసం చేశారని వెల్లడించారు.
అయితే 2019లో అరెస్టయిన ఇక్బాల్ మిర్చి కేసుతో పాటు ఆర్కేడబ్ల్యూ కంపెనీతో రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అలానే ముంబయి ఎయిర్పోర్ట్ సమీపంలో అతడికి ఓ ప్లాట్ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటిని కుంద్రా తోసిపుచ్చాడు.
ఇవీ చదవండి: