నందమూరి నటసింహం బాలకృష్ణ కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అయితే తాజాగా బాలయ్య లుక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. స్టైల్ అదిరిందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డీసెంట్ హెయిర్‌కట్, స్టైలిష్ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తోన్న నందమూరి బాలయ్యను చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ హీరో డాబర్డ్ డౌనీ జూనియర్లా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికను హీరోయిన్లుగా ఎంపిక చేసింది చిత్రబృందం. భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. 'అవార్డులొస్తే ఆనందమే.. కానీ ఆసక్తి లేదు'