"జెర్సీ.. వందలో గెలిచిన ఒక్కడి కథ కాదు.. ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మంది కథ".. ఈ ఒక్క డైలాగ్తో సినిమా మొదట్లోనే ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. ఇక పూర్తిగా చూశాక.. భావోద్వేగాలు నిండిన హృదయంతో హాల్లో నుంచి బయటకు వస్తాడు. 'అర్జున్' పాత్ర చాలా రోజులు మనతోనే ఉంటుంది. అద్భుత నటనతో ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని.
'జెర్సీ'.. క్రీడా నేపథ్యంలో తీసిన సినిమానే అయినా క్రికెట్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకున్ని మెప్పిస్తుంది. నవ్విస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. అందుకే.. భాష, ప్రాంతం భేదం లేకుండా గుండెల్లో పెట్టుకుని ఆదరించారు అభిమానులు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ, అనిరుధ్ సంగీతం సినిమాను జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిపాయి.
ఇక ఇప్పుడు ఈ చిత్రం ఎల్లలు దాటి విదేశీయుల మన్ననలను పొందుతోంది. ఇటీవలే ఈ సినిమాను చూసిన ఆస్ట్రేలియాలోని ప్రముఖ క్రీడా జర్నలిస్టు అమందా బెయిలీ.. అమితమైన భావోద్వేగానికి గురైనట్లు రాసుకొచ్చారు.
"జెర్సీ చూశాను. అది గొప్ప భావోద్వేగపూరిత ప్రయాణం. అద్భుతంగా తీశారు. నాని బాగా చేశాడు. మనం 'అర్జున్'తో నవ్వుతాం, ఏడుస్తాం. అతడి కలలు మనవిగా భావిస్తాం. ఇక రైల్వే స్టేషన్ సన్నివేశం నా ఫేవరేట్. అది చూస్తున్నప్పుడు అప్పటివరకు ఉన్న భయం కాస్త ఆనందంగా మారింది" అని అమందా చెప్పారు.
-
Best film in recent times 😍#Jersey #1yearofClassicJersey #1YearForJersey pic.twitter.com/2mL5H5eMe3
— Ganesh (@Sganesh_9999) April 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Best film in recent times 😍#Jersey #1yearofClassicJersey #1YearForJersey pic.twitter.com/2mL5H5eMe3
— Ganesh (@Sganesh_9999) April 19, 2020Best film in recent times 😍#Jersey #1yearofClassicJersey #1YearForJersey pic.twitter.com/2mL5H5eMe3
— Ganesh (@Sganesh_9999) April 19, 2020
ఇదీ చూడండి: ప్రయత్నిస్తూ ఓడిన 99 మంది కథే 'జెర్సీ'