బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు(Aryan Khan Arrest) జైలులో క్యాంటీన్ ఖర్చుల కోసం రూ.4,500 రూపాయలను వాళ్ల కుటుంబీకులు జైలుకు మనియార్డర్ చేశారు(shahrukh khan son bail). డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ప్రస్తుతం ముంబయిలో అర్థర్‌రోడ్ చెరసాలలో ఉన్నాడు. ఇక జైల్లో ఖైదీగా ఉన్న ఆర్యన్‌కు అధికారులు నెం.956ని కేటాయించారు
అక్టోబర్ 11న షారుక్ కుటుంబం మనియార్డర్ చేసినట్లు తెలిపారు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్. జైలు నిబంధనల ప్రకారం చెరసాల లోపలున్న వారు ఖర్చుల కోసం గరిష్టంగా 4,500 రూపాయల మనియార్డర్ పొందవచ్చని వెల్లడించారు.
తిండి తినట్లేదు
జైలులో ఖైదీలకు పెట్టే ఆహారాన్ని ఆర్యన్, అతడితో పాటు అరెస్ట్ అయిన వాళ్లు తినట్లేదని సమాచారం. అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఆర్యన అయితే కేవలం నీళ్లు, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నాడట!
అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో(Mumbai Rave Party) ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్‌మూన్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం న్యాయస్థానం వారిని ఎన్సీబీకి అప్పగించింది. అప్పటి నుంచి వీరు జైలులోనే ఉన్నారు.
ఇదీ చూడండి: Drugs in bollywood: ఆర్యన్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ