విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న 'పాగల్' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలకు ముహూర్తం కుదిరింది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ఈ పాట రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సిమ్రన్ చౌదరి, సలోని మిశ్రా హీరోయిన్లు. నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.
యశ్పూరి, శ్వేతా పరాషార్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'అలాంటి సిత్రాలు'. సుప్రిత్ సి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశాడు ప్రముఖ నిర్మాత దిల్రాజు. నలుగురు విభిన్న తరహా వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడిన తర్వాత వారి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. డైలాగ్స్ అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">