అల్లు అర్జన్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ల తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కలయికలో వస్తున్న చిత్రం కావడం విశేషం. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలు సినీప్రియుల్లో మంచి ఆదరణ పొందాయి.
ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కథకు అలనాటి ఎన్టీఆర్ చిత్రం 'ఇంటిగుట్టు'కు పోలికలున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు ఆ సినిమా కథనే నేటి తరానికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రహస్యం బయటకి పొక్కడానికి ఆయన దగ్గర పనిచేస్తున్న సహాయకులే కారణమని, వారు మూల కథను లీక్ చేసినట్లు తెలిసి త్రివిక్రమ్ ఆగ్రహాం చెందినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే మాటల మాంత్రికుడు మనసు విప్పే వరకు వేచి చూడక తప్పదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">