ETV Bharat / sitara

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! బుల్లెట్టు దిగిందా లేదా..!? - మహేష్ పూరీ జగన్నాథ్

మహేష్​బాబు 'పోకిరి' సినిమాకు 15 ఏళ్లు పూర్తయింది. పవర్​ఫుల్​ డైలాగ్స్, అదిరిపోయే క్లైమాక్స్, పూరీ డైరెక్షన్ ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో విశేషాలు ఈ చిత్రంలో ఉన్నాయి. వాటి గురించే ఈ ప్రత్యేక కథనం.

15 YEARS FOR MAHESH BABU-PURI JAGANNADH 'POKIRI'
మహేశ్​బాబు పోకిరి సినిమా
author img

By

Published : Apr 28, 2021, 1:19 PM IST

మీ అందరికీ పండుగాడు గుర్తున్నాడా..? గుర్తులేడా..!? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు.. ! ఇప్పుడు గుర్తొచ్చిందా.. ? "పోకిరి"గా పండుగాడు కొట్టిన దెబ్బకు ఇండస్ట్రీకి కూడా మైండ్ బ్లాంక్ అయింది మరి..! పండుగాడిగా.. మహేష్​బాబు మేనరిజమ్స్.. పూరీ టేకింగ్.. ఇలియానా మ్యాజిక్... మణిశర్మ మ్యూజిక్.. అన్నీ కలిపి.. బాక్సాఫీస్​ను షేక్ చేశాయి. ఆ మ్యాజిక్ జరిగి బుధవారానికి(ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ పోకిరీ ఫ్రెష్ ఫీలింగ్​నే ఇస్తోంది.

MAHESH BABU 'POKIRI'
మహేష్​ పోకిరి సినిమా

2006 ఏప్రిల్ 28

క్యూట్ క్యూట్ మహేష్​బాబు... రుమూలుతో రఫ్పులుక్కులో రెచ్చిపోతాడని.. అప్పటికే కొన్ని హిట్లు కొట్టిన్నప్పటికీ.. పూరీ జగన్నాథ్ మాస్ మసాలాతో.. హిస్టరీ సృష్టిస్తాడని.. అప్పటికి ఒక్క సినిమాలోనే చేసిన ఇలియానా.. స్టార్ హీరోయిన్​గా స్టాంప్ వేసుకుంటుందని.. మణిశర్మ మ్యూజిక్ కు బాక్సులు బద్దలవుతాయని.. ఆ రోజు వరకూ ఎవ్వరూ అనుకోలేదు. పోకిరీ దెబ్బకు.. అప్పటివరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తుడుచిపెట్టుకుపోయాయి. దక్షిణాదిలో ఓ ప్రాంతీయ సినిమా.. ఏ స్థాయిలో వైబ్రేషన్ కలిగిస్తుందో అప్పట్లో పోకిరీ నిరూపించింది. మహేష్​కు ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం ఒక్కటే కాదు.. తన సినీగమనాన్ని పూర్తిగా మార్చేసింది!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అసలు పోకిరి కాదు..

పోకిరి..సినిమాకు ఏదీ అనుకున్నట్లు జరగలేదు.అసలు ఆ పేరే పోకిరీ కాదు. పూరీ ఊహల్లో ఉన్న సినిమా వేరు. ఈ సినిమాను "ఉత్తమ్ సింగ్- సన్నాఫ్ సూర్యనారాయణ" అనే టైటిల్​తో పూరీ రాసుకున్నారు. బద్రి సమయంలోనే పవన్ కల్యాణ్​కు ఈ కథ చెప్పారు. ఆయన చేయలేదు. రవితేజ హీరోగా తీయాలనుకున్నారు. అప్పటికే హిట్ హీరోగా నిలదొక్కుకున్న రవితేజ వేరే కమిట్​మెంట్స్​లో ఉండటం వల్ల పూరీ ఎదురు చూశారు. అదే సమయంలో సూపర్ సినిమా తీసిన పూరీ జగన్నాథ్.. సోనూసూద్​తో కూడా ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. చివరకు స్టోరీ మహేష్ దగ్గరకు వచ్చి ఆగింది. కథ వినడం.. మహేష్ ఓకే చేయడం జరిగిపోయింది. ఈ సినిమాలో ముందు హీరోయిన్​గా కంగనా రనౌత్ ఎంపికైంది. బాలీవుడ్​లో 'గాంగ్​స్టర్'​కు, ఈ సినిమాకు ఒకేసారి అవకాశం రావడం వల్ల కంగన అటు వెళ్లిపోయింది.. ఇలియానా ఎంటరైంది.

పేలిన డైలాగులు

ఈ సినిమాలోకి మహేష్ ఎంటరవ్వడం వల్ల చాలా మార్పులు జరిగాయి. పూరీ కథలోనే కాదు.. మహేష్​లుక్కులోనూ చాలా మార్పులు తీసుకొచ్చారు. అప్పటివరకూ ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్​ను పూర్తిగా మార్చేశారు. "ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను.. " అనే టాగ్​లైన్ ఇచ్చి... రఫ్పులుక్కుతో జనం మీదకు వదిలారు. మహేష్ ను అలా చూసిన కుర్రకారు హోరెత్తిపోయింది. సినిమాలో గన్లు మాత్రమే కాదు.. డైలాగులు కూడా సూపరుగా పేలాయి. "ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా??" ‘సినిమాలు చూడట్లేదేటి’ వంటి మాస్ డైలాగులు.. ‘" ఏనాడైనా పెట్టావా ఉప్మా.." అంటూ పలికిన డైలాగులు.. థియేటర్లలో విజిల్స్ మోత మోగించాయి. అప్పుడే కాదు .. ఇప్పటికీ ఆ సినిమాలో మేనరిజమ్స్.. డైలాగులను యువత వాడుతున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో చెప్పుకోవచ్చు. "టైల్స్ ఏస్తున్నారంటగా.. పద్మావతి హ్యాపీయా.. ? వంటి మేనరిజంను ఏదో ఒక సందర్భానికి వాడుతూనే ఉంటారు. అసలు మహేష్​లో ఆ యాంగిల్ ఉందని.. డైలాగుల విషయంలో అంత పొటెన్షియాలిటీ ఉందని కానీ ఎవ్వరూ ఊహించని పరిస్థితి అప్పటికీ.. ఇక క్లైమాక్స్ లో కృష్ణమనోహర్ ఐపీఎస్​గా తను.. పోలీస్ యూనిఫామ్ లో కనిపించడం అసలైన ట్విస్టు. అది ఫాన్సుకు పూనకాలు తెప్పించింది.

మ్యూజిక్ మ్యాజిక్

"‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే"’ అంటూ.. ఒక ఐటమ్ సాంగ్​ను కూడా మామూలుగా అందరూ విని.. పాడుకునేలా తీర్చిదిద్దారు... పూరీ- మణిశర్మ. హీరో ఇంట్రడక్షన్ పాట, గలగలపారుతున్న గోదారిలా అనే మెలోడీ.. డోలె.. డోలె జరజరా అనే బీట్ సాంగ్.. మొత్తం మీద రెండు మూడేళ్ల పాటు ఎక్కడ చూసిన పోకిరి పాటలే.. ఇప్పటికీ ఆ మ్యూజిక్​లో అదే మ్యాజిక్ కనిపిస్తుంటుంది.

రికార్డులే రికార్డులు

పోకిరి అప్పటి వరకూ ఎవరూ ఊహించలేనంత రికార్డులు సృష్టించింది. ఏకంగా 200 సెంటర్లలో 100రోజులు ఆడింది. ఇది ఆలిండియా రికార్డు. 63కేంద్రాల్లో 175 రోజులు, కర్నూలులో 365, 500రోజులు కూడా ఆడింది. అప్పట్లోనే రూ.66 కోట్ల గ్రాస్ ను, రూ.44కోట్లు షేర్​ వసూలు చేసి.. ఓ తెలుగు సినిమా అంత కలెక్ట్ చేయగలగుతుందా అని నిరూపించింది. ఆ తర్వాత తమిళంలోనూ అదే పేరుతో విజయ్ హీరోగా విడుదలై, అక్కడా రికార్డులు సృష్టించింది. బాలీవుడ్​లో సల్మాన్​భాయ్ వాంటెడ్ పేరుతో రీమేక్​ చేసిన మన మేనరిజాన్ని చూపించారు.

pokiri records
పోకిరి రికార్డులు

ఇప్పుడు ఒక్కో సినిమా రెండు మూడు వారాలు ఆడటమే ఎక్కువు. డబ్బులు వస్తున్నప్పటికీ.. అప్పటి థియేటర్ ఎక్స్​పీరీయన్సులు రావడం లేదని.. నిజమైన సినిమా లవర్స్ ఇప్పటికీ ఫీలవుతుంటారు. అలాంటి మాస్ మసాలా ఫీలింగ్ ఫుల్లుగా ఇచ్చిన సినిమా ఇది..! మహేష్ చెప్పినట్లు.. బుల్లెట్టు గట్టిగా దింపిన మూవీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.