ETV Bharat / science-and-technology

WhatsApp Latest Feature : వాట్సాప్​ మల్టీ అకౌంట్ ఫీచర్​.. ఇకపై క్లోనింగ్​ యాప్స్​తో పనిలేదు! - వాట్సాప్ బీటా యూజర్స్​ అప్​డేట్​

WhatsApp Latest Feature In Telugu : వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. వాట్సాప్​ మల్టీ అకౌంట్ ఫీచర్​ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్​డేట్​ వల్ల.. యూజర్లు ఒకే వాట్సాప్ యాప్​లో రెండు వేర్వేరు వాట్సాప్​ ఖాతాలను వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

WhatsApp  Multi account feature
WhatsApp Latest Feature
author img

By

Published : Aug 12, 2023, 6:11 PM IST

WhatsApp Latest Feature 2023 : వాట్సాప్​ తన యూజర్ల కోసం మరో అదిరిపోయే (WhatsApp Multi account feature) ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు ఒకే యాప్​లో.. రెండు వేర్వేరు వాట్సాప్​ ఖాతాలను వినియోగించుకునే విధంగా సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.

క్లోనింగ్ యాప్స్​తో పనిలేదు!
WhatsApp cloning apps : ఇప్పటి వరకు యూజర్లు ఒక ఫోన్​లో కేవలం ఒకే వాట్సాప్​ ఖాతాను వినియోగించుకోగలుగుతున్నారు. లేదంటే.. క్లోనింగ్​ యాప్స్ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కొందరు కొందరు రెండు వాట్సాప్ ఖాతాలను యాక్సెస్​ చేసేందుకు రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ ఇబ్బందికి చెక్​ పెడుతూ వాట్సాప్​ ఈ సరికొత్త (WhatsApp Multi account feature) ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో యూజర్లు ఒకే వాట్సాప్ యాప్​లో రెండు వేర్వేరు ఖాతాలను నిర్వహించుకోవచ్చు.

ఒకే యాప్​లో రెండు ఖాతాలు
WhatsApp Multi account feature : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్​ అందుబాటులోకి వచ్చిన వారు.. తమ వాట్సాప్​ ఖాతాలో క్యూఆర్​ కోడ్​ ఆప్షన్​ వద్ద యారో (బాణం) గుర్తు సాయంతో మరో అకౌంట్​ని యాడ్ చేసుకోవచ్చు. అంటే రెండు వాట్సాప్ ఖాతాల మధ్య చాలా సులభంగా స్విచ్​ కావచ్చు. దీని వల్ల ఒకే సమయంలో ఒక ఖాతాలో వ్యక్తిగత సంభాషణలు చేయవచ్చు. మరో ఖాతా వృత్తి, ఉద్యోగ పరమైన సంభాషణలు జరపవచ్చు.

WhatsApp Latest Security Features : ప్రస్తుతం ఈ వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్​ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. వాట్సాప్​ ఇప్పటికే లాక్​ చాట్​, స్క్రీన్​ షేరింగ్​, మల్టీ డివైజ్​ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా ఎన్నో భద్రతా పరమైన ఫీచర్లను కూడా నిరంతరాయంగా అప్​డేట్ చేస్తోంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా గూగుల్ మీట్​, జూమ్ తరహాలో వాట్సాప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాట్సాప్​ గ్రూప్​లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు.. వాట్సాప్ అడ్మిన్ రివ్యూ ఫీచర్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రూప్​ చాట్​లో ఎవరైనా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన మెసేజ్​లు పెడితే, వాటిని గ్రూప్​ అడ్మిన్​లు డిలీట్​ చేయగలుగుతారు.

Video Calling Feature On Twitter : ట్విట్టర్​లో వీడియో కాలింగ్​ ఫీచర్​!.. ధ్రువీకరించిన ఎక్స్​ సీఈఓ లిండా!

200% ఫాంట్​ సైజ్​.. స్క్రీన్​ ఫ్లాష్​ నోటిఫికేషన్.. సూపర్​ ఫీచర్స్​తో 'ఆండ్రాయిడ్​ 14' రెడీ​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.