ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో బ్లాక్ చేసేందుకు షార్ట్​కట్.. చాట్ ఓపెన్ చేయకుండానే.. - వాట్సాప్ బ్లాక్ ఫీచర్

వాట్సాప్​లో ఎవరినైనా బ్లాక్ చేసేందుకు కొత్త షార్ట్​కట్ రాబోతోంది. నోటిఫికేషన్ ట్యాబ్ ద్వారా బ్లాక్ చేసే ఫీచర్​ను తీసుకురాబోతుంది ఆ సంస్థ.

WHATSAPP BLOCKING VIA NOTIFICATION
WHATSAPP BLOCKING VIA NOTIFICATION
author img

By

Published : Jan 17, 2023, 6:09 PM IST

వాట్సాప్​లో ఎవరైనా నచ్చకపోతే వెంటనే వారిని బ్లాక్ చేసేస్తాం. స్పామ్ అకౌంట్లు, అవసరం లేని బిజినెస్ అకౌంట్లపైనా ఇలాగే బ్లాకింగ్ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాం. ఇలా చేస్తే మన లాస్ట్ సీన్, ఆన్​లైన్ స్టేటస్, స్టేటస్ అప్డేట్స్, ప్రొఫైల్ ఫొటో వంటివేవీ బ్లాక్ లిస్ట్​లో ఉన్నవారికి కనిపించవు. మనకు మెసేజ్, కాల్స్ చేయడం కూడా కుదరదు. ఇప్పుడు కొత్త రకమైన బ్లాక్ ఆప్షన్​ను వాట్సాప్ మనకు అందుబాటులోకి తెస్తోంది. నోటిఫికేషన్ ద్వారా యూజర్లను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అతి త్వరలోనే ఈ అప్డేట్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ అప్డేట్​పై వాట్సాప్ టీమ్ పనిచేస్తోందని 'WABetaInfo' వెబ్​సైట్ తెలిపింది. అయితే, ఈ ఫీచర్ కాంటాక్టుల్లో ఉన్న నెంబర్లకు పనిచేయదని వెల్లడించింది. అపరిచిత కాంటాక్టులు, స్పామ్ అకౌంట్లను నియంత్రించడానికి ఈ ఫీచర్ పనికొస్తుందని తెలిపింది. వారి చాట్స్ ఓపెన్ చేసే అవసరం లేకుండా.. నోటిఫికేషన్ ట్యాబ్ ద్వారానే బ్లాక్ చేసేయవచ్చు. ఈ అప్డేట్ వల్ల కాంటాక్టులను బ్లాక్ చేయడం సులభమవుతుందని వాట్సాప్ భావిస్తోంది. బ్లాక్ చేసేందుకు యూజర్లు ఎక్కువ సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ షార్ట్​కట్ బ్లాక్ ఆప్షన్​ అప్డేట్​ను త్వరలోనే విడుదల చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.