పచ్చి బఠానీలను బంగాళాదుంప, వంకాయ కూరల్లో కలగలుపుగా వేసుకోవడం తెలిసిందే. ఇవి కూరకు అదనపు రుచిని అందిస్తాయి. అంతేకాదు వీటిల్లో పోషకాలూ అధికమే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా...
* కొవ్వు శాతం తక్కువగా ఉండే బఠానీల్లో ప్రొటీన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
* ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారినపడకుండా వీటిల్లోని పోషకాలు అడ్డుకుంటాయి.
* వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
* పచ్చి బఠానీల్లో అధికంగా ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మారోగ్యాన్ని కాపాడటంతోపాటూ ముడతలు పడకుండా చేస్తాయి.
* వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్లు, కెరొటినాయిడ్లు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.