ETV Bharat / opinion

పొగచూరుతున్న భవితవ్యం- విద్యార్థుల్లో ధూమపాన వ్యసనం

38శాతం సిగరెట్లు, 47శాతం బీడీలు, 52శాతం గుట్కా వంటి ఉత్పత్తుల్ని పిల్లలు తమ పదో పుట్టిన రోజుకన్నా ముందుగానే రుచి చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. విద్యార్థులను పొగ ఉచ్చులోకి లాగేందుకు విద్యాసంస్థల చుట్టూ ప్రచార ప్రకటనల్ని హోరెత్తిస్తుండటం విస్తుగొలిపే పరిణామం. నిబంధనల్ని తోసిరాజంటూ, పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాల వద్ద సిగరెట్లకు సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడం, చౌకగా అమ్మడం, సింగిల్‌ సిగరెట్లు అమ్మడం ద్వారా ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో  పొగాకు నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.

Tobacco in children
చిన్నారుల్లో పొగాకు వినియోగం
author img

By

Published : Aug 20, 2021, 7:14 AM IST

పొగ తాగడం, పొగాకు వాడకం హానికరం. మనదేశంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రస్థాయిలో సాగిస్తున్న ప్రచారమిది. అన్ని ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా ధూమపాన వ్యతిరేక ప్రచారం చేస్తున్నా- పిల్లల్లో పొగాకు అలవాటు పదేళ్లలోపే మొదలవుతుండటం దిగ్భ్రాంతికరం. దీనికి తోడు, భారత్‌లో 29 శాతానికిపైగా విద్యార్థులు పరోక్ష ధూమపాన ప్రభావానికి లోనవుతున్నట్లు 'ప్రపంచ యువత పొగాకు సర్వే (జీవైటీఎస్‌-4, 2019)' జాతీయ ఫ్యాక్ట్‌షీట్‌ నివేదిక వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌ (ఐఐపీఎస్‌) అధ్యయన నివేదికను ఇటీవలే కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు.

పరోక్ష ధూమపానంలోనూ...

బాలురు, విద్యార్థుల్లో పొగాకు వినియోగం అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరమ్‌లలో అత్యధికంగా ఉండగా- హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకల్లో తక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్​ నివేదికలో వెల్లడైంది. సిగరెట్లు, ఈ-సిగరెట్లు, సిగార్లు, పైపుల ద్వారా వెలువడే పొగను పక్కనున్నవారు పీల్చడాన్ని పరోక్ష ధూమపానంగా చెబుతారు. నేరుగా పీల్చే సిగరెట్‌ పొగలో ఉండే 7,000 రసాయనాలు, 100 విషపదార్థాలు, 70 క్యాన్సర్‌ కారకాల వంటివన్నీ పరోక్ష ధూమపానంలోనూ ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం గత అయిదు దశాబ్దాల కాలంలో పొగతాగని వారిలో 25 లక్షల మంది పరోక్ష ధూమపానం కారణంగా మరణించారు.

యువతే లక్ష్యం

బాల్యంలో పరోక్ష ధూమపానం మరింత ప్రమాదకరం, ప్రాణాంతకం. దశాబ్ద కాలంలో బడికి వెళ్ళే (13-15 ఏళ్లు) వయసు వారిలో ధూమపానం 42శాతం వరకు తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయి. 38శాతం సిగరెట్లు, 47శాతం బీడీలు, 52శాతం గుట్కావంటి ఉత్పత్తుల్ని పిల్లలు తమ పదో పుట్టిన రోజుకన్నా ముందుగానే రుచి చూస్తున్నట్లు తేలడం బాధాకరం. ప్రఖ్యాత పొగాకు కంపెనీలు భారతీయ యువతనే తమ ఉత్పత్తులకు లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. గతంలో అమెరికా వంటి దేశాల్లో ఉపయోగించిన వ్యూహాలనే అమలు చేస్తున్నాయి. విద్యార్థులను పొగ ఉచ్చులోకి లాగేందుకు విద్యాసంస్థల చుట్టూ ప్రచార ప్రకటనల్ని హోరెత్తిస్తున్నట్లు ఓ సర్వేలో తేలడం విస్తుగొలిపే పరిణామం. నిబంధనల్ని తోసిరాజంటూ, పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాల వద్ద సిగరెట్లకు సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడం, చౌకగా అమ్మడం, సింగిల్‌ సిగరెట్లు అమ్మడం ద్వారా ఆకర్షిస్తున్నారు.

పట్టించుకొనేవారే లేరు..

18 ఏళ్లకన్నా తక్కువ వయసుండే వారికి, విద్యాసంస్థలకు వంద గజాల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధం. వీటిని అమ్మే దుకాణాల్లో చిన్నారుల్ని ఆకర్షించే చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్‌, శీతలపానీయాలు తదితర పొగాకేతర ఉత్పత్తులేవీ అమ్మకూడదనే నిబంధనతోనే అనుమతులు జారీ చేస్తున్నా, ఆచరణలో పట్టించుకొనేవారే లేరు. చట్టం అమలు కాకపోవడం, తనిఖీలు లేకపోవడంతో బడులకు సమీపంలోనే అక్రమంగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల దృష్టిని ఆకర్షించేలా అమ్మకందారులు పొగాకు ఉత్పత్తులు, పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణాల్లో 54శాతం ఎలాంటి హెచ్చరిక బోర్డులనూ ప్రదర్శించడం లేదు. 90శాతం షాపుల్లో తీపిపదార్థాలు, ఆటబొమ్మలు, క్యాండీల వంటివి అమ్ముతున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో పొగాకు నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.

ఏం చేయాలి?

ధూమపానంతో తలెత్తే నష్టాలపై పిల్లల్లో అవగాహన పెంపొందించడంలో ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని ఆరోగ్య మంత్రి మాండవీయ ఇటీవల అభిప్రాయపడ్డారు. పాఠ్యప్రణాళికల్లో ప్రాథమిక దశ నుంచి పై తరగతుల వరకు దశలవారీగా పొగాకు దుష్ఫలితాలపై పాఠ్యాంశాలు ఉండాలన్నారు. విభిన్న పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు వేర్వేరు విధానాలు తీసుకురావాలి. కౌమార వయస్కుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం మునుపటికన్నా పెరిగిందని గుర్తించాలి. గుట్కావంటి నమిలే పొగాకు వినియోగం మనదేశానికి సంబంధించిన ప్రత్యేక సమస్య. దీనిపై నిషేధం ఉన్నా కోట్లమందికి ఆ ప్యాకెట్లు అందుబాటులోనే ఉంటున్నాయి. చిన్నారులకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన శిక్షలు పడే చట్టమున్నా, అది అమలు కావడంలేదు. విచ్చలవిడిగా సాగుతున్న విడి సిగరెట్ల అమ్మకాన్ని అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది.

మనదేశంలో ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో పొగాకు వినియోగానికి అనుమతి లేదు. ప్రకటనలపైనా నిషేధం ఉంది. టీవీ, రేడియో, సినిమాల్లో పొగాకు వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. సిగరెట్‌ డబ్బాలపై 85 శాతానికిపైగా హెచ్చరిక బొమ్మలుండాలనే నిబంధన విధించారు. వినోద తెరపై ధూమపాన సంబంధిత దృశ్యాలు వస్తే ఓ మూలన హెచ్చరికను ప్రదర్శించాలి. ఇలాంటి నిబంధనలన్నీ బాగానే ఉన్నా- సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్స్‌, ఇతర వినోద కార్యక్రమాల్లో నటులు ధూమపానం చేసే దృశ్యాల వల్ల వీక్షకులపై ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అలాంటి దృశ్యాలు వచ్చినప్పుడు ఓ మూలన చిన్న హెచ్చరికను వేయడం కాకుండా, నటీనటులు పొగాకు సంబంధ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు చూపడాన్ని నిషేధిస్తే మంచిది.

- డి.శ్రీనివాస్‌

ఇదీ చూడండి: మీకు ఆ అలవాట్లు ఉన్నాయా?.. అయితే జాగ్రత్త!

ఇదీ చూడండి: ప్రాణాల్ని పీల్చేస్తున్న పొగాకు వ్యసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.