ETV Bharat / opinion

Vehicles Scrappage Policy: తుక్కు విధానం ప్రయోజనకరమేనా? - దేశంలో పాత వాహనాలు

పాత వాహనాల రద్దు విధానాన్ని(Vehicles Scrappage Policy) పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గడమే కాక కొత్త వాహనాల ఉత్పత్తి పెరిగి, భారీగా ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. వాహనదారులు పాత వాహనాలను వదిలి కొత్తవి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం పరిశీలిస్తోంది. మరోవైపు.. పాత వాహనాలను తుక్కు కింద మార్చేటప్పుడు వాటిలోని ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్ భాగాలను తేలిగ్గా పునర్వినియోగించవచ్చు.

తుక్కువిధానం
తుక్కువిధానం
author img

By

Published : Aug 30, 2021, 8:48 AM IST

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతను తలపిస్తూ అటు కాలుష్య నివారణకు, ఇటు ఉపాధి సృష్టికి తోడ్పడే పాత వాహనాల రద్దు విధానాన్ని(Vehicles Scrappage Policy) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని 'స్వచ్ఛంద వాహన ఆధునికీకరణ కార్యక్రమం' పేరిట మార్చిలో పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్‌లో మదుపరుల సదస్సులో ఈ విధానాన్ని ఆవిష్కరిస్తూ- ఇది అందరికీ లబ్ధి చేకూర్చే వలయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు. బహుశా 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి వాహన తుక్కు లేక రద్దు విధానం అమలులోకి రావచ్చు. మోటారు వాహనాల పునర్వినియోగం, ఒకే వాహనాన్ని పలువురు పంచుకోవడం, పాత విడిభాగాలను పునర్వినియోగించడం, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల ఉత్పత్తిని పెంచడాన్ని వలయ ఆర్థిక విధానంగా వర్ణించవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గడమే కాక కొత్త వాహనాల ఉత్పత్తి పెరిగి, భారీగా ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి.

భారతదేశంలో 20 ఏళ్లకు పైబడిన తేలికపాటి రవాణా వాహనాలు 51 లక్షల వరకు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షల వరకు ఉంటాయని అంచనా. 15 ఏళ్లు పైబడి సరైన యోగ్యతా పత్రాలు లేకుండా తిరుగుతున్న మధ్యతరహా, భారీ వాహనాలు 17 లక్షల వరకు ఉంటాయి. వీటన్నింటినీ ఉన్నపళాన తుక్కు కింద మార్చేయాలని ప్రభుత్వం ఉద్దేశించడం లేదు. పాత వాహనాలకు పరీక్షలు చేసి, తుక్కు కింద మార్చడానికి తగు మౌలిక వసతులు కల్పించి, ఆ వాహనాల్లో పనికొచ్చే పరికరాలు, సామగ్రిని పునర్వినియోగించే కేంద్రాలను నెలకొల్పిన తరవాతనే తుక్కు విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున దేశమంతటా 718 స్వయంచాలిత యోగ్యతా ధ్రువీకరణ కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం లక్షిస్తోంది. తుక్కు విధానం రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 35,000 కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని గడ్కరీ పార్లమెంటుకు తెలిపారు.

రాయితీలు, ప్రోత్సాహకాలు

వాహనదారులు పాత వాహనాలను వదిలి కొత్తవి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం పరిశీలిస్తోంది. తుక్కు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసి, దాని ఆధారంగా కొత్త వాహన రిజిస్ట్రేషన్‌ రుసుము తగ్గించడమో, మాఫీ చేయడమో, లేక కొత్త కారు ధరపై రాయితీ ఇవ్వడమో, పన్నులు తగ్గించడమో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాత వాహనాల వినియోగాన్ని కొనసాగించాలని యజమాని అనుకుంటే, వాటిని మళ్ళీ రిజిస్ట్రేషన్‌ చేయడానికి రుసుమును ఎనిమిది రెట్ల నుంచి 20 రెట్ల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఈ ఏడాది అక్టోబరు నుంచే అమలులోకి రావచ్చు. 15 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను తప్పనిసరిగా రీ-రిజిస్ట్రేషన్‌ చేయాలి. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా దేశాలు 2008నాటి ఆర్థిక సంక్షోభం తరవాత పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తేవడానికి పాత వాహన రద్దు విధానాలను తీసుకొచ్చాయి. ఇవి వాహన క్రయవిక్రయాలను పెంచి, కాలుష్య నియంత్రణ, ఉపాధి సృష్టికి తోడ్పడ్డాయి. జర్మనీ ప్రతి పాత కారు రద్దుకు దాదాపు రెండు లక్షల రూపాయల ప్రీమియం ఇచ్చినందువల్ల, అక్కడ కొత్త వాహన విక్రయాలు 40శాతం పెరిగాయి. ఫ్రాన్స్‌ ప్రతి వాహనానికి 80 వేల రూపాయల చొప్పున, స్పెయిన్‌ రూ.3.5 లక్షల చొప్పున ప్రీమియం చెల్లించాయి. భారతదేశ తుక్కు విధానంలో వాహన యజమానులకు ఇచ్చే రాయితీల గురించి ఇంకా స్పష్టత లేదు. వ్యక్తిగత వాహనదారులకన్నా పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులు నడుపుతూ రవాణా వ్యాపారం చేసే కంపెనీలకు తుక్కు విధానం ఎక్కువ ప్రయోజనకరం కావచ్చు.

పర్యావరణానికి మేలు

ప్రభుత్వ అనుమతితో వ్యక్తులు, సంస్థలు తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటును కొత్త విధానం కల్పించవచ్చు. కార్ల కంపెనీలు సైతం స్వయంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చే కేంద్రాలను నెలకొల్పి, తమవద్దే కొత్త వాహనాలను కొనేవారికి భారీ తగ్గింపు ధర అందించవచ్చు. మహింద్రా కంపెనీ మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌తో కలిసి మహీంద్రా యాక్సెలో పేరిట వాహన తుక్కు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. మారుతి సుజుకి, టొయోటా కంపెనీలు దిల్లీ సమీపంలోని నొయిడాలో 50మంది సిబ్బందితో సంయుక్త తుక్కు కేంద్ర ఏర్పాటుకు నిర్ణయించాయి. పాత వాహనాలను తుక్కు కింద మార్చేటప్పుడు వాటిలోని ఉక్కు, అల్యూమినియం భాగాలను తేలిగ్గా పునర్వినియోగించవచ్చు. దీనివల్ల ఇనుము, అల్యూమినియం కోసం గనుల మీద ఆధారపడాల్సిన అగత్యం తగ్గి, ఆ మేరకు పర్యావరణానికి హాని తప్పుతుంది. గనుల తవ్వకాలు వాయు, జల కాలుష్యాలకు కారణమవుతున్నాయి. ఆధునిక కార్లలో మూడో వంతు ప్లాస్టిక్‌ విడిభాగాలే ఉంటాయి. కార్లను తుక్కుగా మార్చేటప్పుడు ప్లాస్టిక్‌ భాగాలను వేరుచేసి పునర్వినియోగించవచ్చు. లేదంటే ఆ ప్లాస్టిక్‌ నదులు, సముద్రాల్లో కలిసిపోయి తీవ్ర కాలుష్యానికి కారణమవుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ తుక్కు విధానాన్ని అమలులోకి తెచ్చేముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

- ప్రసాద్‌

ఇదీ చూడండి: 'సంపద సృష్టికి తుక్కు పాలసీ దోహదం'

ఇదీ చూడండి: తుక్కు విధానం.. ప్రభుత్వ వాహనాలతోనే షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.