ETV Bharat / lifestyle

కరోనా తగ్గిన తర్వాత త్వరగా కోలుకోవాలంటే..!

కరోనా మహమ్మారి మన శరీరంపై దాడి చేసి.. ఆయా అవయవాల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఇక తీరా నెగెటివ్‌ వచ్చాకనైనా ఆరోగ్యం కుదుటపడుతుందా అంటే.. దానికీ చాన్నాళ్లే సమయం పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే కరోనా నుంచి బయటపడినా చాలామందిలో దగ్గు, జలుబు, నీరసం, అలసట.. వంటి లక్షణాలు కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కొవిడ్‌ లక్షణాలను దూరం చేసుకొని త్వరగా కోలుకోవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే అవేంటో సూచిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె.

What to eat in corona days, how to recover from corona

author img

By

Published : May 4, 2021, 7:00 PM IST

జలుబు, దగ్గు, జ్వరం, నీరసం, వాసన-రుచి కోల్పోవడం.. ఇలాంటి కొవిడ్‌ లక్షణాలు కొంతమందికి నెగెటివ్‌ వచ్చినా తగ్గుముఖం పట్టట్లేదు. ఇందుకు కారణం ఆయా అవయవాలపై వైరస్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాలు తగ్గి తిరిగి మునుపటిలా సాధారణ స్థితికి రావాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే మన ఆహారపుటలవాట్లలో చిన్న పాటి మార్పులు చేసుకుంటే కొవిడ్‌ తర్వాత త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌.

ఈ మార్పులతో కోలుకోవచ్చు!

* సాధారణంగా మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం మొదట తీసుకునే ఆహారంపైనే అది ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొవిడ్‌ నుంచి కోలుకునే వారు రాత్రి నానబెట్టిన బాదం పప్పులు, ఎండు ద్రాక్షలను ఉదయాన్నే తీసుకోవడం మంచిది. తద్వారా బాదంలోని ప్రొటీన్, ఎండు ద్రాక్షలోని ఐరన్‌ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

* ఇక అల్పాహారంలో భాగంగా.. రాగి దోసె లేదంటే పారిడ్జ్ (తృణధాన్యాలను పాలలో ఉడికించి తయారుచేసుకునే పదార్థం. ఉదాహరణకు.. ఓట్‌మీల్‌) తీసుకోవాలి. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇక ఓట్‌మీల్‌ రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది.

* మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెల్లం-నెయ్యి కలిపి తీసుకోవడం శ్రేష్టం. ఈ క్రమంలో ఈ కాంబినేషన్‌ను చపాతీతోనైనా తినచ్చు.. లేదంటే అన్నం తినడం పూర్తయ్యాక ఒక చిన్న బెల్లం ముక్కపై కాస్త నెయ్యి వేసుకొని చప్పరించచ్చు. ఈ రెండు పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, హార్మోన్లను సమతులం చేయడంలో సమర్థంగా పని చేస్తాయి.

* శారీరక అలసటను దూరం చేసుకోవాలంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ క్రమంలో రాత్రుళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే రాత్రి మితమైన భోజనం, సులభంగా జీర్ణమయ్యే పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు కిచిడీ చక్కటి ప్రత్యామ్నాయం. మనం ఇందులో వాడే పప్పులు, నెయ్యి, కాయగూరల ద్వారా ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు.. వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి.

* కొవిడ్‌ కారణంగా తలెత్తే నీరసం, అలసటను తగ్గించుకోవాలంటే శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా!

* శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే అందుకు ఆరోగ్యకరమైన క్యాలరీలుండే ఆహారం చక్కగా దోహదం చేస్తుంది. ఈ క్రమంలో గోధుమ, ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌, చిరుధాన్యాలు, బంగాళాదుంప, చిలగడ దుంప.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవడం మంచిది. తద్వారా అటు శక్తిని పొందచ్చు.. ఇటు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.

* ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకోవడంలో ప్రొటీన్ల పాత్ర కీలకం అని చెబుతున్నారు నిపుణులు. వీటిలోని అమైనో ఆమ్లాలు వ్యాధికారకాలతో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ క్రమంలో రోజుకు 70-100 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోమని సూచిస్తున్నారు. పాలు, పాల పదార్థాలు, సోయా, నట్స్‌, గింజలు, మాంసం, ఉడికించిన కోడిగుడ్డు.. వంటి పదార్థాల్లో ఈ పోషకం ఎక్కువగా లభిస్తుంది.

* పండ్లు, కాయగూరల్ని ఎక్కువ మొత్తాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే నిమ్మ, బత్తాయి పండ్లతో పాటు శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుకోవడానికి తర్బూజా, కీరా వంటివి చక్కగా ఉపయోగపడతాయి.

* కూరల్లో మోతాదుకు మించి నూనెల వాడకాన్ని తగ్గించాలి. ఇందులోనూ అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌, సోయా, సన్‌ఫ్లవర్‌.. వంటి అన్‌శ్యాచురేటెడ్‌ నూనెల్ని ఉపయోగించడం శ్రేయస్కరం.

* వంటకాల్లో ఉప్పు, చక్కెరలను మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

* రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చగా ఉండే పసుపు పాలు తాగడం వల్ల శారీరక అలసట మాయమవుతుంది. అలాగే ఎముకలూ దృఢంగా మారతాయి.

* కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో శరీరం నిస్తేజంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బలవంతంగా వ్యాయామాలు చేయడం సరి కాదు. అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడేందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయచ్చు. అది కూడా నిపుణుల సలహా మేరకే చేయడం మంచిది.

* అలాగే మల్టీ విటమిన్‌ మాత్రలు వాడాలనుకున్న వారు కూడా డాక్టర్‌ సూచన మేరకే వాడాలన్న విషయం గుర్తు పెట్టుకోండి.

ఇదీ చూడండి: 'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.