ETV Bharat / jagte-raho

వాగు దాటుతుండగా కాలువలో మునిగి మహిళ మృతి

author img

By

Published : Nov 15, 2020, 2:27 PM IST

వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.

woman died in lake in kamareddy
వాగు దాటుతుండగా కాలువలో మునిగి మహిళ మృతి

బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి మార్గమధ్యలో వాగు దాటుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిజాం సాగర్​ మండలం మంగళూరుకి చెందిన గాండ్ల అనుషవ్వ(44) శనివారం మధ్యాహ్నం కల్లేరు గ్రామానికి బయలు దేరింది. గ్రామ సమీపంలోని నల్లవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఆదివారం.. వాగులో మృతదేహం తేలడం గమనించిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దీపకాంతుల నడుమ కళకళలాడిన పల్లెలు, పట్టణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.