బాలానగర్ నుంచి షిరిడి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాలేదని కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరంలోని బాలానగర్ ఫిరోజ్ గూడకు చెందిన రమణమ్మ, తిరుమలయ్య ఈనెల 10న ఏపీలోని కడపలో జరిగిన కుమారుడు నాగచైతన్య వివాహానికి హాజరై 12న తిరిగి హైదరాబాద్ వచ్చారు.
తర్వాత ఈనెల 24న నాగచైతన్య బాలానగర్ రాగా... తల్లిదండ్రులు ఇంట్లో కనిపించలేదు. వారి ఆచూకీపై స్థానికులను ఆరా తీయగా.. షిరిడి వెళుతున్నట్లు చెప్పారని తెలిపారు. దీంతో తల్లిదండ్రుల జాడ కోసం వెతకగా వారి చరవాణి స్విచ్ఆఫ్ చేసి ఉందని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.