ETV Bharat / jagte-raho

రూ.50 లక్షల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం: రాచకొండ సీపీ

నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. 50 లక్షలు విలువచేసే నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్వోటి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.

author img

By

Published : Jun 9, 2020, 5:37 PM IST

rachakonda cp mahesh bhagavath pressmeeet about Arrest of gang selling fake cotton seeds in hyderabad
ఈనెలలో ఇది రెండో ముఠా: రాచకొండ సీపీ

పదిరోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాల ముఠాను అరెస్టు చేశామని.. ఇప్పుడు రెండోసారి మరో ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్​ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. 50 లక్షలు విలువచేసే నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్​ హయత్​నగర్​లోని బ్రాహ్మణపల్లిలో ఓ గోదాం తీసుకుని నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని వివరించారు. ప్రధాన నిందితుడు కర్నూల్​ జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లను అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు. ఐదు మంది ముఠాగా ఏర్పడి విత్తనాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

బ్రాండ్ కంపెనీల పేరుతో కవర్లు ముద్రించి నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సీపీ స్ఫష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతంలో నకిలీ విత్తనాలు అమ్మకాలు చేసిన వ్యక్తి పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి ముఠాలు ఉంటే సమాచారం అందించాలని కోరారు.

ఈనెలలో ఇది రెండో ముఠా: రాచకొండ సీపీ

ఇవీ చూడండి: ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.