ETV Bharat / jagte-raho

విశాఖలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం! - గాజువాక వార్తలు

ఏపీ విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్​లోని బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతమైంది. ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే పోలీసులు కేసుని ఛేదించారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. నిందితులను అరెస్టు చేశారు.

police-crack-case-of-boy-abduction-in-visakhapatnam
విశాఖలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం!
author img

By

Published : Nov 1, 2020, 4:19 PM IST

ఏపీ విశాఖ గాజువాక ఆటోనగర్‌లో కలకలం రేపిన నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈకేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.

రాజస్థాన్‌కు చెందిన నరేష్‌ యాదవ్‌.. విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపుతున్నారు. ఆటోనగర్​లో శనివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కొందరు వ్యక్తులు అపహరించారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి నరేష్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెట్వర్క్ ద్వారా లొకేషన్​ను గుర్తించి రెండు గంటల్లోనే కేసును ఛేదించారు. వన్ టౌన్ ఏరియాలోని ఓ ఇంటిలో బాలుడిని ఉంచినట్లు కనుగొన్న పోలీసులు... దుండుగుల నుంచి సురక్షితంగా కాపాడారు. కిడ్నాప్ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

రూ.43 లక్షల అప్పు వ్యవహారమే అపహరణకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ పట్టుదల ఎందరికో ఆదర్శం.. 62 ఏళ్లలో నీట్ 54వ ర్యాంక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.