ETV Bharat / jagte-raho

ఘరానా మోసం: బంగారం తాకట్టు పెడితే గోల్డ్​ కాయిన్​.. - ఈటీవీ భారత్​ వార్తలు

బంగారం తాకట్టు పెడితే గోల్డ్ కాయిన్ ఇస్తామంటూ... ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ వీరబాబు కోటిన్నర విలువైన పసిడి దోచేశాడు. అయితే కంపెనీకి తెలియకుండా... మేనేజర్ గోల్డ్ కాయిన్ ఎర వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఘరానా మోసం: బంగారం కుదవ పెడితే గోల్డ్​ కాయిన్​..

author img

By

Published : Nov 20, 2020, 9:23 AM IST

బంగారం కుదవ పెడితే గోల్డ్ కాయిన్ ఇస్తామంటూ... ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ కోటిన్నర విలువైన పసిడి దోచేశాడు. అయితే కంపెనీకి తెలియకుండా... మేనేజర్ గోల్డ్ కాయిన్ ఎర వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏపీలోని విజయవాడ తోటవారి వీధికి చెందిన సౌమ్య.... ఏడేళ్లుగా ముత్తూట్ ఫైనాన్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ముత్తూట్ మేనేజర్ వీరబాబు మాటలు నమ్మిన ఆమె... రెండు విడతలుగా 300 వందల గ్రాముల బంగారాన్ని కుదవ పెట్టారు. కొన్ని రోజుల తర్వాత కొత్త మేనేజర్‌ రావడంతో... గోల్డ్ కాయిన్ విషయమై సౌమ్య ఆరా తీశారు. అలాంటి బహుమతులేమీ ఇవ్వడం లేదని చెప్పడంతో... మోసపోయినట్లు నిర్ధరణకు వచ్చారు. దీనిపై ఆమె పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరికొందరి నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా 2.750 కేజీల బంగారం ఈ రకంగా కుదువ పెట్టినట్లు తేల్చిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సింగపూర్​లో మర్డర్ ఫ్లాన్.. ఉంగుటూరులో అమలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.