జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పంచాలింగాల వద్ద పోలీసులు భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి ఏపీకి భారీస్థాయిలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. వనపర్తి జిల్లా పెబ్బెరులోని యాదవ్ కాలనీకి చెందిన వేముల రాజు గౌడ్ అనే వ్యక్తి నుంచి 1,704 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోని కర్నూల్ జిల్లా పంచలింగాలకు చెందిన చాకలి బీచ్‌పల్లి, తులశాపురం గ్రామానికి చెందిన సురేశ్, ఓర్వకల్లు మండలం తోటగేరికి చెందిన కే. సురేశ్, కర్నూల్ ముజఫర్ నగర్ కు చెందిన ఎస్బీ శేఖర్ కలుగోట్ల గ్రామానికి చెందిన హెచ్.శివకుమార్ లపై కేసు నమోదు చేశారు. 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు లక్ష్మిదుర్గయ్య తెలిపారు.