అప్పుల బాధ తాళలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం కందాడ గ్రామానికి చెందిన అంజన్ చారి కనిపించడం లేదని అతడి భర్త ఆగస్టు 31న చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అతడి వివరాలు సేకరించగా.. కందాడ గ్రామానికి చెందిన అంజన్ చారి అని తేల్చారు. ఆత్మహత్యకు కారణం అప్పులే అని పోలీసులు తెలిపారు. మృతుడికి దాదాపు రూ.2 కోట్ల అప్పులున్నట్టు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు