హైదరాబాద్ చాదర్ ఘాట్ ప్రాంతంలో రోహిణి అనే మహిళ తన సంవత్సరన్నర వయస్సు గల కుమారుణ్ని ఎవరో అపహరించారని చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడిషనల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి అదేశాలతో రంగంలోకి దిగిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు ఆ ప్రాంతాని క్షుణ్నంగా పరిశీలించారు.
ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడని సీసీటీవి ద్వారా గుర్తించారు. ఆ వ్యక్తి పాతబస్తీ తలాబ్ కట్ట ప్రాంతానికి చెందినవాడని నిర్ధరణకు వచ్చారు. అతణ్నిఅదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. కొన్ని గంటల్లోనే చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన ఈస్ట్ జోన్ పోలీసులను డీసీపీ అభినందించారు.