హైదరాబాద్ శంషాబాద్‌లోని కోత్వాల్ వద్ద ఓ కారును... దొంగలించేందుకు నలుగురు వ్యక్తులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టంది. కొత్తూరు నుంచి జీడిమెట్ల వైపు వస్తున్న ఫార్చ్యునర్ కారుని ఆపిన నిందితులు... డ్రైవర్‌ను చితకబాది దొంగలించారు. అయితే కిలో మీటర్ దూరం వెళ్లగానే... కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు.
కారు డ్రైవర్ వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో నగదు ఉందని డ్రైవర్ తెలపగా.... అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు
ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''