ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాలస్తీనా ఉగ్రవాదులు గాజా, ఇజ్రాయెల్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను మంగళవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. 700 మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. 500మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతేగాక 15 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించారని చెప్పారు.
ఇస్లాం, జడాయిజం, క్రైస్తవ మతాల వారికి ఏంతో పవిత్ర స్థలమైన జెరూసలెంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవాలని చూడడం వల్ల ఎప్పటిలాగే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. స్థానిక అల్-అక్సా మసీదు ప్రాంగణంలో నివాసం ఉంటున్న పాలస్తానీయులు ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు కోరడం కారణంగా ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనా వారికి ఘర్షణలు తలెత్తాయి.
రాత్రంతా ఇజ్రాయెల్లో డజన్ల కొద్దీ రాకెట్లు లాంఛ్ చేస్తుండడం వల్ల ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే శాంతి స్థాపనకు అమెరికా, యూరప్ పిలుపునిచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దీంతో దేనికైనా సిద్ధంగా ఉండాలని నేతన్యాహు సైన్యానికి సూచించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: గాజాలో పేలుడు- 20 మంది మృతి