Philippines Bus Accident : బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటం వల్ల 16 మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన సెంట్రల్ ఫీలిప్పీన్స్లోని మనీలాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన బస్సు ఇలోయిల్ ప్రాంతం నుంచి వస్తోంది. పర్వత ప్రాంతాల సమీపంలోని ఓ మలుపు దగ్గర బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పొయాడు. దీంతో బస్సు కాంక్రీటు రెయిలింగ్‌కు ఢీకొట్టి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు ఆర్మీ, అత్యవసర ప్రతిస్పందన బృందాలు కలిసి సహాయక చర్యల్లో పాల్గొనట్లు అధికారులు తెలిపారు.
బాధితుల కోసం అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించామని అత్యవసర ప్రతిస్పందన అధికారి పబస్టన్ తెలిపారు. లోయలో దట్టమైన చెట్లు ఉండటం వల్ల బాధితుల కోసం గంటల కొద్ది శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. అలానే స్థానికులకు లోయలో ఇంకా ఎవరైన కనిపిస్తే వెంటనే ప్రాంతీయ అధికారులకు తెలియజేయాలని పబస్టన్ తెలిపారు.
బ్రిడ్జ్‌పై నుంచి లోయలో పడిన బస్సు
Bus Accident in Honduras : సెంట్రల్ అమెరికాలోని హోండురస్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటం వల్ల 12 మంది మృతి చెందారు . దాదాపు డజను మందికి పైగా గాయడ్డారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్య అమెరికా ఆర్థిక రాజధాని తెగుసిగల్పా నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలో వంతనపై నుంచి ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే 10 మంది మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చిక్సిత పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్స్, అంబులెన్స్‌ల్లో స్థానిక ఆసుపత్రికి తరలించారని అధికారులు పేర్కొన్నారు.
Mexico Bus Crash : ఘోర బస్సు ప్రమాదం.. 16మంది దుర్మరణం.. అంతా వలసదారులే..