ETV Bharat / international

వైరస్​కు, మానవత్వానికి మధ్య పోరు: బోరిస్​

ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా పోరాడి కరోనా మహమ్మారిని ఓడించాలని పిలుపునిచ్చారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​. జీవితకాల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ను కనుగొనేందుకు అన్ని దేశాలు సహకరించుకోవాలని స్పష్టం చేశారు.

It's humanity against the virus
వైరస్​కు మానవత్వానికి మధ్య పోరు: బోరిస్​
author img

By

Published : May 4, 2020, 8:51 PM IST

కరోనాపై పోరాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్. ఐక్యంగా ముందుకు సాగితేనే వైరస్​ను జయించవచ్చన్నారు. ఇవాళ వర్చువల్ గ్లోబల్​ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, మనమంతా జీవితకాల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైరస్​కు, మానవత్వానికి మధ్య జరగుతున్న యుద్దంలో ఐకమత్యంతో ముందుకుసాగి పైచేయి సాధించాలని తెలిపారు.

బోరిస్​ నిర్వహించి ఈ సమావేశంలో కెనడా, ఫ్రాన్స్​, ఇటలీ, జపాన్, నార్వే, సౌదీ అరేబియా పాల్గొన్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం 388 మిలియన్ పౌండ్లను సమకూరుస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన 744 మిలియన్ పౌండ్ల నిధుల్లో ఇవి భాగమన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలవడమేగాక కరోనా మహమ్మారిని అంతమొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్​ అభివృద్దికి సంయుక్తంగా ఏర్పాటైన కూటమికి 250 మిలియన్లను కేటాయించి అత్యధిక నిధులు అందించిన దేశంగా బ్రిటన్ నిలిచింది.

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ పురోగతిపై ఈ సమామేశంలో తెలిపారు జాన్సన్​. వ్యాక్సిన్​ భారీ సంఖ్యలో తయారు చేసి పంపిణీ చేసేందుకు భాగస్వాములు కావాలని యూనివర్సిటీ ప్రకటించింది. ప్రస్తుతం వ్యాక్సిన్​పై ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.