ETV Bharat / international

'కరోనా టీకా అభివృద్ధి చేసిన మూడో దేశంగా టర్కీ'

author img

By

Published : Aug 10, 2020, 7:33 PM IST

అమెరికా, చైనా తర్వాత స్థానికంగా కరోనాకు వ్యాక్సిన్లు తయారు చేసిన మూడో దేశంగా టర్కీ నిలిచిందన్నారు ఆ దేశ అధ్యక్షుడు రిసెప్​ తయీప్​ ఎర్డోగాన్​. ప్రస్తుతం 8 రకాల వ్యాక్లిన్లు, 10 రకాల ఔషధాలపై పని చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు టీకాలు జంతువులపై పరీక్షలు పూర్తి చేయగా.. ఒకదానికి క్లినికల్​ ట్రయల్స్​కు అనమతులు వచ్చినట్లు చెప్పారు.

Turkey becomes third country to develop COVID-19 vaccines
'కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన మూడో దేశంగా టర్కీ'

దేశీయంగా కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన మూడో దేశంగా టర్కీ నిలిచిందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు రిసెప్​ తయీప్​ ఎర్డోగాన్​. తమ దేశం కన్నా ముందు అమెరికా, చైనా మాత్రమే స్థానికంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వాయవ్య రాష్ట్రం కోకలీలో.. టర్కీ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన మండలి (టీయూబీఐటీఏకే) కేంద్రాల ప్రారంభోత్సవంలో ఈ మేరకు వెల్లడించారు ఎర్డోగాన్​.

" టీయూబీఐటీఏకే ఏర్పాటు చేసిన కొవిడ్​-19 విభాగం.. ప్రస్తుతం 8 రకాల వ్యాక్సిన్లు, 10 రకాల ఔషధాలపై పని చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో కరోనా కట్టడికి వ్యాక్సిన్లు, ఔషధాలను​ అభివృద్ధి చేయటంలో గణనీయమైన పురోగతి సాధించాం."

- రిసెప్​ తయీప్​ ఎర్డోగాన్​, టర్కీ అధ్యక్షుడు

ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు జంతువులపై పరీక్షలను పూర్తి చేశాయని, మనుషులపై క్లినికల్​ ట్రయల్స్​కు మరో టీకాకు అనుమతులు లభించినట్లు తెలిపారు ఎర్డోగాన్​.

టర్కీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 2,39,622 కేసులు నమోదయ్యాయి. 5,829మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కరోనా నియంత్రణ కష్టమే: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.