ETV Bharat / international

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్​ ప్రభుత్వం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 342 స్థానాలున్న ఆ దేశ జాతీయ అసెంబ్లీలో 178 ఓట్లు సాధించి బలపరీక్షలో గెలుపొందారు. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 172 ఓట్లు అవసరం. ఈ విశ్వాస తీర్మానాన్ని విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ప్రతిపాదించారు. అధికార పాకిస్థాన్‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఉన్న 156 మంది సహా, మిత్రపక్షాలు ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.

Pakistan PM Imran Khan wins trust vote in National Assembly
విశ్వాస పరీక్ష నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్
author img

By

Published : Mar 6, 2021, 2:42 PM IST

Updated : Mar 6, 2021, 2:56 PM IST

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టగా ఈ మేరకు విజయం సాధించారు. మెుత్తం 342 స్థానాలున్న ఆ దేశ దిగువ సభ పార్లమెంట్‌లో విజయానికి అవసరమైన 172 ఓట్లు ఇమ్రాన్‌ ప్రభుత్వం సాధించింది. ఇమ్రాన్‌కు మద్దతిస్తున్న మిత్రపక్షాల ఓట్లు కలుపుకొని 178 ఓట్లు సాధించింది.

ఇమ్రాన్‌పై విశ్వాస పరీక్షలో పాల్గొనబోమని 11 ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటింగ్‌ నుంచి వైదొలిగాయి. ఈ విశ్వాస తీర్మానాన్ని విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ప్రతిపాదించారు. అధికార పాకిస్థాన్‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఉన్న 156 మంది సహా, మిత్రపక్షాలు ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.

సెనేట్ స్థానం ఎన్నికలో సొంత పార్టీకే చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు ఇమ్రాన్‌.

ఇదీ చదవండి: విశ్వాస పరీక్షలో విజయంపై ఇమ్రాన్​ ఖాన్​ ధీమా!

Last Updated : Mar 6, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.