ETV Bharat / international

అమెరికాలో ఒక్కరోజే 2 వేల మంది మృతి

అమెరికాలో కరోనా మహమ్మారి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2 వేల మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో వైరస్ ధాటికి 1.60 లక్షల మంది చనిపోవటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.

US DEATHS
అమెరికా
author img

By

Published : Aug 7, 2020, 2:55 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ఇప్పటికే నిత్యం దాదాపు వెయ్యి మరణాలు చోటుచేసుకుంటుండగా.. తాజాగా గురువారం ఒక్కరోజే 2వేల మంది మృతి చెందడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. చివరిసారిగా మే నెల తొలివారంలో ఒకేరోజు అక్కడ 2వేల మంది మృత్యువాతపడ్డారు.

రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక మాస్కు ధరించాలని సూచించింది.

కొంత కాలంగా అమెరికాలో నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 49 లక్షలకు చేరింది. వీరిలో ఇప్పటికే లక్షా 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా న్యూయార్క్‌లో 32వేల మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీ(15,800), కాలిఫోర్నియా (10,006) రాష్ట్రాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికంగా ఉంది.

అమెరికా ఖండాల్లోనూ..

లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. బ్రెజిల్‌, మెక్సికోలోనే లక్షా యాభైవేల మరణాలు సంభవించాయి. పెరూ, కొలంబియా, చీలీ దేశాల్లో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. లాటిన్‌ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది.

భారత్​ ఐదో స్థానంలో..

ప్రపంచంలో కరోనా తీవత్ర అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో కేసుల సంఖ్య 30లక్షలకు చేరువైంది. బ్రెజిల్‌లో ఇప్పటికే 98వేల మంది కరోనా రోగులు చనిపోయారు. కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 42 వేలకు చేరింది.

ప్రస్తుతం కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. జాన్​ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న తొలి మూడు దేశాల్లో క్రియాశీల కేసులు, మరణాలు వివరాలు ఇలా ఉన్నాయి.

దేశం యాక్టివ్ కేసులు మరణాలు
అమెరికా 13.5 లక్షలు 1,60,091
బ్రెజిల్ 5.4లక్షలు 98,493
భారత్ 6.07లక్షలు 41,585

ఇదీ చూడండి: 'అమెరికా మరోసారి ఆలోచించుకుంటే మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.