ETV Bharat / international

ఒబామా పుస్తకం రికార్డ్​- నెల రోజుల్లోనే 33లక్షల అమ్మకాలు - అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా రచించిన 'ఎ ప్రామిస్డ్​ ల్యాండ్' రికార్డు స్థాయి అమ్మకాలను సాధిస్తోంది. ప్రచురితమైన నెల రోజుల్లోనే 33లక్షలకు పైగా కాపీల అమ్మకాలతో బెస్ట్​ సెల్లర్​గా దూసుకుపోతోంది.

Barack Obamas A Promised Land
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా
author img

By

Published : Dec 17, 2020, 5:03 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఏకంగా 33 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ మధ్య కాలంలో ఏ దేశాధ్యక్షుల పుస్తకమూ ఈ స్థాయిలో అమ్మకాలు సాగించలేదంటే అతిశయోక్తి కాదు.

గతంలో అధ్యక్షులుగా పనిచేసిన బిల్​ క్లింటన్ రాసిన 'మై వైఫ్​' 35లక్షల కాపీలు అమ్ముడవగా.. జార్జ్​ డబ్ల్యూ బుష్​ పుస్తకం 'డెసిషన్​ పాయింట్స్​' 40లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు వాటితో సమానంగా ఒబామా పుస్తకానికి ఆదరణ లభిస్తున్నట్లు ప్రచురణ సంస్థ క్రౌన్​ తెలిపింది.

ఒబామా పుస్తకం ఇప్పటికే 33లక్షలకుపైగా కాపీలు అమ్ముడవగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పుస్తకంలో 2008 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవటం, తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన అంశాలను ప్రస్తావించారు ఒబామా. ఈ పుస్తక రెండవ భాగం విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే.. ఎప్పుడనేది వెల్లడించలేదు

గతంలో ఒబామా రచించిన 'డ్రీమ్స్ ఫ్రమ్​ మై ఫాథర్​', 'ద అడాసిటీ ఆఫ్ హోప్​' పుస్తకాలు సైతం ఇదే స్థాయిలో అమ్ముడయ్యాయి.

ఇదీ చూడండి: రికార్డు సృష్టించిన ఒబామా 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.