పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారమైన పులిట్జర్ అవార్డు-2019 ప్రకటన కార్యక్రమం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగింది. న్యూయార్క్ టైమ్స్, ద వాల్ స్ట్రీట్ జర్నల్, అసోసియేటెడ్ ప్రెస్ సహా పలు వార్తా పత్రికలను వేర్వేరు విభాగాల్లో పులిట్జర్ వరించింది.
జర్నలిజం అవార్డు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేసి, పన్ను చెల్లింపుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతిష్ఠాత్మక జర్నలిజం అవార్డును అందుకుంది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు మహిళలకు ట్రంప్ రహస్యంగా సొమ్ములిచ్చారన్న ఆరోపణలపై పరిశోధనాత్మక కథనం ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్ పులిట్జర్‌ను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ రిపోర్టింగ్...
యెమెన్ సంక్షోభంపై ముగ్గురు అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు రూపొందించిన డాక్యుమెంటరీకి పులిట్జర్ అంతర్జాతీయ రిపోర్టింగ్ అవార్డు లభించింది. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన అమానుష చర్యలపై రాయిటర్స్ చేసిన కథనం అంతర్జాతీయ రిపోర్టింగ్ బహుమతిని అందుకుంది.
2018 ఫిబ్రవరిలో మార్జరి స్టోన్మెన్ డౌగ్లస్ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో ఆ విద్యాసంస్థ, న్యాయ శాఖ అధికారుల తప్పిదాలపై సన్- సెంటినల్ పత్రిక కథానికి పులిట్జర్ అవార్డు వరించింది.
మరిన్ని..
పులిట్జర్ ఫిక్షన్ అవార్డు- ద ఓవర్స్టోరీ (రిచర్డ్ పవర్స్)
పులిట్జర్ డ్రామా- ఫెయిర్ వ్యూ
ఇదీ చూడండి: చారిత్రక నోటర్ డామ్ చర్చిలో అగ్ని ప్రమాదం