చిలీలోని వాల్పారైసో అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు నగరమంతా విస్తరించాయి. 120 ఇళ్లు బూడిదైపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.
నగర సమీపంలోని రోక్వాంట్, శాన్ రోక్ కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.