ETV Bharat / international

ఆ రాష్ట్రంలో జూన్​ వరకు విద్యాసంస్థలు బంద్​

న్యూయార్క్​లో పాఠశాలలు, కళాశాలలు విద్యాసంవత్సరం అయిపోయేవరకు మూసివేసి ఉంటాయని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో జూన్​ చివరివరకు పాఠశాలలను తెరిచేది లేదని గవర్నర్ క్యూమో స్పష్టం చేశారు.

VIRUS-US-NY-SCHOOLS
విద్యాసంస్థలు
author img

By

Published : May 2, 2020, 4:09 PM IST

అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్​లో ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో.

"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులను వైరస్​ నుంచి కాపాడేందుకే విద్యాసంస్థల మూసివేత కొనసాగిస్తున్నాం. కానీ, అన్ని పాఠశాలలు, కళాశాలల్లో దూర విద్య, భోజనాల డెలివరీ, శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి."

- ఆండ్రూ క్యూమో, న్యూయార్క్ గవర్నర్

ఈ పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభిస్తే భౌతిక దూరం పాటించేలా చూడటం, గుమిగూడకుండా నియంత్రించటం కష్టమని ఆండ్రూ పేర్కొన్నారు. జూన్​లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కరోనాను ఎదుర్కొనేందుకు పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

న్యూయార్క్​లో 700 జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, 4,800 పాఠశాలలు, 1,800 ప్రైవేటు పాఠశాలలు, 89 విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఇందులో చదువుకుంటోన్న42 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.

అమెరికావ్యాప్తంగా చూస్తే న్యూయార్క్​లోనే అధిక కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,942 కేసులు పెరగగా.. మొత్తం సంఖ్య 3.08 లక్షలకు చేరింది.

ఇదీ చూడండి: 'కరోనా వైరస్ సహజసిద్ధంగానే ఉద్భవించింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.