ETV Bharat / international

డోక్లాం ప్రతిష్టంభన నుంచే చైనా కుట్రలు - 2017 డోక్లాం తర్వాత 13 సైనిక స్థావరాలు, 3 వైమానిక స్థావరాలు, 5 శాశ్వత ఎయిర్​డిఫెన్స్ పొజిషన్లు

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కుయుక్తులు ఈ నాటివి కావని ఓ నివేదికలో వెల్లడైంది. 2017 డోక్లాం సైనిక ప్రతిష్టంభన తర్వాత వాస్తవాధీన రేఖకు దగ్గరలో చైనా 13 నూతన వైమానిక స్థావరాలను నిర్మించిందని ప్రముఖ రక్షణ కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది. డోక్లాం ప్రతిష్టంభన తర్వాత సగం కంటే ఎక్కువగా వైమానిక స్థావరాలను రెట్టింపు చేసినట్లు తెలిపింది. తూర్పు లద్ధాఖ్‌ ఉద్రిక్తతల తర్వాత ఈ నిర్మాణాల వేగం ఊపందుకుందని వెల్లడించింది.

China doubles air bases
చైనా ఎయిర్​బేస్
author img

By

Published : Sep 23, 2020, 5:30 AM IST

వాస్తవాధీన రేఖ వెంబడి తమ వైపు చైనా చేపడుతున్న నిర్మాణాలపై ప్రముఖ భద్రతా కన్సల్టెన్సీ సంస్థ స్ట్రాట్‌ఫర్‌ విస్తృత నివేదికను వెల్లడించింది. 2017లో డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా తమవైపు సైనిక స్థావరాలను రెట్టింపు చేసిందని పేర్కొంది. ఈ ప్రతిష్టంభన తర్వాత చైనా 13నూతన సైనిక స్థావరాలను నిర్మించినట్లు వెల్లడించింది. వీటిలో 3 వైమానిక స్థావరాలు, 5 శాశ్వత ఎయిర్‌ డిఫెన్స్‌ పొజిషన్లు సహా ఐదు హెలీపోర్టులను నిర్మించినట్లు తెలిపింది. ఈ ఐదు హెలీపోర్టులలో 4 హెలీపోర్టులను తూర్పు లద్ధాఖ్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత నిర్మించినట్లు పేర్కొంది.

భారతసరిహద్దుల్లో చేపడుతున్న సైనిక నిర్మాణాలు చైనా ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నాయని స్ట్రాట్‌ఫర్‌ నివేదిక పేర్కొంది. 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను మార్చినట్లు వెల్లడించింది. దీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. భవిష్యత్‌ అవసరాల కోసం ఈ నిర్మాణాలను చేపడుతున్నట్లు అంచనా వేసింది. ఇటీవల భారత్‌ కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు కొంత మేర ఉపశమనమేనని తెలిపింది. అయితే, భారత వైమానిక సామర్థ్యాన్ని పెంచేందుకు దేశీయంగా రక్షణ పరికరాల తయారీ, విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలు మరింత సమయం అవసరమని నివేదిక అభిప్రాయపడింది.

అదే వ్యూహంతో

దక్షిణ చైనా సముద్రంలో అవలంభించిన వ్యూహాన్నే డ్రాగన్‌ వాస్తవాధీన రేఖ వద్ద కూడా ఆచరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. శాశ్వత స్థావరాలను నిర్మించి వాటి ద్వారా చైనా సైన్యానికి మద్దతు అందించడం వ్యూహంలో భాగమని తెలిపింది. భవిష్యత్‌ సరిహద్దు వివాదాల్లో... తన సైనిక ప్రదర్శనల ద్వారా, సైనిక ఘర్షణల ద్వారా భారత సేనలను నిరుత్సాహ పరచాలని చైనా యోచిస్తున్నట్లు పేర్కొంది.

2017లో దాదాపు 73 రోజుల పాటు భారత-చైనా సేనల మధ్య డోక్లాం ట్రై- జంక్షన్‌ వద్ద సైనిక ప్రతిష్టంభన నెలకొంది. అయితే పలు విడతల చర్చల తర్వాత ఉద్రిక్తతలు చల్లారాయి. అనంతరం ఈ ఏడాది మే 5న పాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి

For All Latest Updates

TAGGED:

common news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.