మాస్క్ ఎందుకు పెట్టుకున్నావని ఓ వ్యక్తి తనపై దాడి చేస్తానని బెదిరించాడని అమెరికా కేన్సస్ రాష్ట్రంలోని ఆసియన్ అమెరికన్ చట్టసభ్యుడు ఆరోపించారు. అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై వరుస దాడులకు సంబంధించిన వార్తల నేపథ్యంలో సాక్షాత్తు చట్టసభ్యునికే బెదిరింపులు రావడం చర్చనీయాంశమైంది.
"కేన్సస్లోని ఓ బార్లో ఉన్నాను. అప్పుడు ఓ వ్యక్తి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నిస్తూ బూతులు తిట్టాడు. కరోనాను వ్యాప్తి చేస్తున్నావా అని అడిగాడు. కాసేపటి తర్వాత నన్ను తంతానని బెదిరించాడు."
-రీ షూ, కేన్సస్ రాష్ట్ర చట్టసభ సభ్యుడు
గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్ అమెరికన్లపై 3 వేలకు పైగా దాడులు జరిగాయని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. 2019లో ఈ తరహా దాడులు కేవలం 216 మాత్రమే జరగ్గా.. 2020లో దాదాపు 14 రెట్లు పెరిగాయి.
ఇదీ చదవండి: ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం