ETV Bharat / international

'ముందస్తు ఓటింగ్'​కే అమెరికా జనం ఓటు

author img

By

Published : Oct 31, 2020, 7:51 AM IST

అగ్రరాజ్యంలో ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధమవుతున్న వేళ.. ప్రజల్లో కొవిడ్​ ఉద్ధృతి భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు ఓటింగ్​కే మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఇలా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

US-POLLS
'ముందస్తు ఓటింగ్'​కే ఓటేస్తోన్న అమెరికా జనం

మరో నాలుగు రోజుల్లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల రోజు కంటే ముందుగానే అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్నే ఎర్లీ ఓటింగ్‌(ముందస్తు ఓటింగ్‌)గా పిలుస్తారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఈ ఎర్లీ ఓటింగ్‌ పెరుగుతుండగా.. ఈసారి కొవిడ్‌ కారణంగా రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్‌ నమోదైంది. ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఓటేశారు.

US-POLLS
ముదస్తు ఓటింగ్​ దిశగా అమెరికన్లు

మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్

అమెరికాలో కొవిడ్‌ వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల రోజున గుంపులు గుంపులుగా వెళ్తే కొవిడ్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తున్న అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా ప్రజలు పోస్టల్‌ బ్యాలెట్‌ లేదా పోలింగ్‌ కేంద్రాలకు వ్యక్తిగతంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో 50శాతానికి పైగా ఈసారి ముందస్తు ఓటింగ్‌లోనే నమోదవడం విశేషం.

2016 అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 13.8 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అందులో 4.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాగా.. ఈ సారి ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా ఎర్లీ ఓటింగ్‌కు వెళ్లారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అంచనా వేయలేం

ఎర్లీ ఓటింగ్‌లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌.. ట్రంప్‌ కంటే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి ఆధారంగా అధ్యక్ష ఫలితాలను అంచనా వేయలేం. 2016 ఎన్నికల్లో నమోదైన ముందస్తు ఓటింగ్‌లో అప్పటి డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ముందంజలో ఉండగా.. ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. ఓపీనియన్‌ పోల్స్‌లో ట్రంప్‌ కంటే బైడెన్‌ ముందంజలో ఉండటం గమనార్హం. కొవిడ్‌-19 నియంత్రణలో ట్రంప్‌ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా అమెరికాలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గత వారం నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..! నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:టర్కీ భూకంపం: 17కు చేరిన మృతులు- 700మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.