ETV Bharat / entertainment

మీలాగా ఎవ్వరూ ఉండరు నాన్నా.. అదే నా కోరిక: మహేశ్‌బాబు - కృష్ణ

Mahesh Babu: తండ్రి, సూపర్​స్టార్​ కృష్ణ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్​ పోస్ట్ పెట్టారు అగ్రహీరో మహేశ్​బాబు. నిజంగా ఆయనలా ఎవరూ ఉండరని అన్నారు. నేడు (మంగళవారం) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు ట్వీట్​ చేశారు మహేశ్.

Mahesh Babu
mahesh babu father krishna
author img

By

Published : May 31, 2022, 7:16 PM IST

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్‌బాబు సినిమాల్లో బిజీగా ఉన్నా.. కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకూ హాజరవుతారు. సినిమాల విరామ సమయంలో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఈరోజు (మే 31) ఒకప్పటి సూపర్‌ హీరో, మహేశ్‌ తండ్రి కృష్ణ తన 79వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు మహేశ్‌బాబు.

Mahesh Babu
కృష్ణతో మహేశ్

కృష్ణ ఫొటోను అభిమానులతో పంచుకొని మీలాగా ఎవ్వరూ ఉండరంటూ పోస్ట్‌ పెట్టారు మహేశ్​. "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. నిజంగా మీలాగా ఎవ్వరూ ఉండరు. మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ.." అంటూ తన తండ్రికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మహేశ్.

సూర్య మంచి మనసు: కోలీవుడ్‌ హీరో అయినప్పటికీ భాషతో సంబంధం లేకుంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు నటుడు సూర్య. విభిన్న కథలతో ప్రేక్షకులను పలకరించే ఈ హీరో తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్లకు అండగా ఉంటారు. తాజాగా మరోసారి తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచి మంచి మనసు చాటుకున్నాడు.

suriya help
సూర్య

వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన జగదీశ్‌(27) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు హీరో సూర్యకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న సూర్య జగదీశ్‌ ఇంటికి వెళ్లాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడాడు. జగదీశ్‌ భార్యకు ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. అతని కూతురి పూర్తి బాధ్యతను తీసుకుంటానని ఆమె చదువుకు అయ్యే ఖర్చంతా పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు.

ఇదీ చూడండి: రణ్‌బీర్‌ అలా చేస్తాడని తెలిసి షాకయ్యా: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.