Sharukh khan 30 years Pathan First look: ఆయన సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ఆ స్టార్ బయట కనపడితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడేవారు ఎందరో. నటుడిగా మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్.. మన షారుక్ ఖాన్. శనివారంతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 30ఏళ్లు పూర్తిచేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పఠాన్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో చేతిలో గన్‌తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు షారుక్. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇక, ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుందీ మూవీ.
-
30 glorious years. One name loved by all. Presenting Shah Rukh Khan in & as #Pathaan
— Yash Raj Films (@yrf) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/SokGexxaol
">30 glorious years. One name loved by all. Presenting Shah Rukh Khan in & as #Pathaan
— Yash Raj Films (@yrf) June 25, 2022
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/SokGexxaol30 glorious years. One name loved by all. Presenting Shah Rukh Khan in & as #Pathaan
— Yash Raj Films (@yrf) June 25, 2022
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/SokGexxaol
కాగా, 1980లలో టెలివిజన్ సిరీస్‌తో షారుక్ కెరీర్ ఆరంభించారు. 1992లో 'దీవానా'తో తెరంగేట్రం చేశారు. 'డర్' (1993), 'బాజీగర్' (1993), 'అంజామ్' (1994) సినిమాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' (1995), 'దిల్‌తో పాగల్ హై'(1997), 'కుచ్ కుచ్ హోతా హై' (1998), 'కభీ ఖుషీ కభీ గమ్' (2001) తదితర ప్రేమకథా చిత్రాలతో స్టార్ హీరోగా రాణించారు. 2002లో వచ్చిన 'దేవదాస్' సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన.
నిర్మాతగానూ... నటుడిగానే కాదు నిర్మాతగానూ షారుక్ విజయవంతంగా రాణిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థను స్థాపించి అనేక సినిమాల్ని నిర్మించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ అనేక అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఉత్తమ నటుడిగా షారుక్ 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ప్రపంచంలోని ధనిక నటుల్లో షారుక్ కూడా ఒకరు. ఆయన దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఇక నాలుగేళ్లుగా సిల్వర్‌స్క్రీన్‌కు దూరంగా ఉన్న షారుక్.. 2023లో ఒకేసారి మూడు చిత్రాలతో రానున్నారు. 'పఠాన్'తో పాటు, 'జవాన్', 'డంకీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. దీంతో పాటు 'రాకెట్రీ', 'లాల్ సింగ్ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరవనున్నారు.
ఇదీ చూడండి: అలా చెప్పడానికి అస్సలు మొహమాట పడను: కియారా