నటుడు నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం 'బింబిసార'. వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 'బింబిసారుడంటే మరణశాసనం'.. ' ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే'.. లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ప్రేక్షకుల్ని చరిత్రలోకి తీసుకెళ్లేలా చేస్తోంది. ఇప్పటికే టీజర్ సినిమాపై ఎంతో ఆసక్తి పెంచగా ఈ ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రంలో కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: హీరో మాధవన్‌పై రజనీకాంత్ కామెంట్స్.. ఏమన్నారంటే?