ETV Bharat / entertainment

సుధీర్ సినిమాకు 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఎందుకు? టీజర్ చూసి చెబితే స్పెషల్ ప్రైజ్!

author img

By

Published : Apr 10, 2023, 7:54 PM IST

సుధీర్ బాబు లేటెస్ట్ చిత్రం 'మామా మశ్చీంద్ర' టీజర్ రిలీజ్​ అప్డేట్​ వచ్చింది. ఏప్రిల్ 14న టీజర్​ను విడుదల చేయనున్నట్టు మేకర్స్​ వెల్లడించారు. దీంతో పాటు ఓ స్పెషల్​ ఆఫర్ ప్రకటించారు. టీజర్​ చూసి 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఎందుకు పెట్టామో చెబితే సూపర్​ ప్రైజ్​ ఇస్తామని తెలిపారు.

hero sudheer babu mama mascheendra
hero sudheer babu mama mascheendra

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న తాజా సినిమా 'మామా మశ్చీంద్ర'. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్​ ఇచ్చారు సుధీర్​ బాబు. ఏప్రిల్ 14న ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు, దర్శకుడు హర్షవర్ధన్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇందులో వారు ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' టైటిల్ ఉంచాలా లేదా 'మాయ మశ్చింద్ర'గా మార్చాలా అనే గందరగోళంలో ఉన్నారు. అంతా ఈ సినిమా టైటిల్‌ను 'మాయ మశ్చీంద్ర' అని తప్పుగా చదువుతున్నారని, దాన్ని ఆ టైటిల్‌కు మార్చేద్దామని హర్షవర్ధన్ అంటే.. సుధీర్ మాత్రం టైటిల్ మార్చొద్దని పట్టుబట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే, టీజర్ రిలీజైన తర్వాత ప్రేక్షకులే ఏ టైటిల్ ఉంచాలో నిర్ణయిస్తారని తెలిపారు. టీజర్‌లో చూసిన తర్వాత ఆ సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో గెస్ చేసి చెబితే బహుమతి ఇస్తారట. ఫస్ట్ పది మందికి మాత్రమే ఈ ప్రైజ్ లభిస్తుందని స్పష్టం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రొటీన్ కథలకు గుడ్ బై చెప్పి.. వెరైటీ స్టోరీలపై దృష్టి పెట్టారు హీరో సుధీర్ బాబు. అందులో భాగంగానే 'మామా మశ్చీంద్ర' మూవీకి ఓకే చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు మూడు విభిన్న లుక్స్​లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడగా, ఫస్ట్ లుక్​లో పూర్తి భిన్నంగా కనిపించారు. వాటిలో ఒకటి దుర్గ కాగా, మరొకటి పరశురామ్, ఇంకోటి డీజే.

మారుతీ డైరెక్షన్​లో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఈ మూవీ అప్పట్లో భారీ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్దా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా.. హిట్ మాత్రం కలిసి రాలేదు. 'సమ్మోహనం' మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. దాన్ని నిలుపుకునేందుకు చాలానే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులకు ఇటీవల సుధీర్ బాబు హీరోగా మహేశ్​ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హంట్'. ఈ సినిమా భారీ హైప్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత ఈ సినిమా రిలీజైన రెండు వారాల్లోనే మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.