ETV Bharat / entertainment

పుష్ప 2 షూటింగ్ షురూ.. సింహంతో బన్నీ ఫైట్.. సీన్ చూస్తే గూస్​బంప్సే​! - సింహంతో అల్లుఅర్జున్​ ఫైట్​

పుష్ప 2 అభిమానులకు శుభవార్త. సినిమా షూటింగ్ షురూ అయింది. ఈ విషయాన్ని మూవీటీమ్​ సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది.

Allu Arjun kickstarts Pushpa 2
పుష్ప 2 షూటింగ్ షురూ
author img

By

Published : Oct 17, 2022, 5:19 PM IST

ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్ అభిమానులకు గుడ్​న్యూస్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. ఎప్పుడెప్పుడూ షూటింగ్ షురూ అవుతుందా అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ సోషల్​మీడియాలో తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. 'పుష్ప ది రూల్​ వర్క్​ ఫుల్​ స్వింగ్​లో ఉంది' అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇందులో దర్శకుడు సుకుమార్​, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్​ అవిగో వారికర్​తో పాటు మిగతా చిత్రబృందం ఉంది. మొత్తం టీమ్​ ఔట్​పుట్​ను బెస్ట్​ ఇచ్చేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు అని మూవీటీమ్​ పేర్కొంది.

Allu Arjun kickstarts Pushpa 2
పుష్ప 2 షూటింగ్ షురూ

సింహంతో పోరాటం.. అయితే ఈ సినిమాలో ఓ అదిరిపోయే పోరట సన్నివేశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇంటర్వెల్ ముందు సింహంతో బన్నీ ఫైట్​ చేస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ అడవిలో తన టీమ్​తో గంధపు చెక్కల కోసం వెళ్తుండగా.. ఓ సింహం వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుందట. అప్పుడు బన్నీ ఆ సింహంతో పోరాడి తన వాళ్లని కాపాడుతాడట. ఈ సీన్​ అదిరిపోయేలా తీసేందుకు ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది. అయితే దీని కోసం ట్రైనింగ్ ఇచ్చిన నిజమైన సింహాంతోనే షూటంగ్​ జరపాలని మూవీటీమ్ భావిస్తోందట. అయితే ఈ సన్నివేశం ఆర్​ఆర్​ఆర్​ ఎన్టీఆర్​ టైగర్​ ఫైట్​కు పోలిక ఉండకుండా దానిని మించి తీయాలని ఫైట్​ మాస్టర్స్​తో చర్చలు జరుపుతున్నారట. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఆనందంలో ముగినిపోయారు.

ఇదీ చూడండి: వారికి సంఘీభావంగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి​.. కానీ బుక్​ అయిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.