ETV Bharat / crime

Smuggling: ఆరు కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం - ఏపీ వార్తలు

ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8.4 టన్నుల బరువు గల 238 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్‌ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ రివార్డులు అందజేశారు.

red sandal seized
ఎర్రచందనం స్వాధీనం
author img

By

Published : Jul 13, 2021, 10:04 AM IST

ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరులో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకా బొమ్మనహళ్లిలో ఎర్రచందనం స్మగ్లర్‌ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనిని విచారించగా.. ఏపీలోని చిత్తూరు గోదాములో దాచిన 238 ఎర్రచందనం దుంగల గురించి సమాచారం సేకరించారు. అక్కడి పోలీసుల సమాచారంతో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.

8.4 టన్నుల ఈ ఎర్ర చందనం దుంగల విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.6.03 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అక్రమ రవాణకు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ... స్మగ్లర్ ఇమ్రాన్ భాయ్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

ఇదీ చదవండి: AP CURFEW: రాష్ట్రమంతా ఒకేలా కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.