ETV Bharat / crime

Attack on Shalu Chourasia: సాంకేతికతపైనే ఆధారపడటంతోనే దర్యాప్తులో ఆటంకం!

నటి షాలూ చౌరాసియాపై దాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. బృందాలుగా ఏర్పడి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సాంకేతికతపైనే ఆధారపడటంతో దర్యాప్తులో ఆటంకం ఏర్పడుతోంది. దోపిడీకా లేదా మహిళలే లక్ష్యంగా వచ్చాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Attack on Shalu Chourasia
నటి షాలూ చౌరాసియాపై దాడి
author img

By

Published : Nov 19, 2021, 10:19 AM IST

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద రెండు రోజుల కిందట నటి షాలూ చౌరాసియాపై దాడి (attack on shalu Chourasia ) ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సాంకేతికతపైనే ఆధారపడటంతో దర్యాప్తులో ఆలస్యం జరుగుతోంది. చౌరిసియా ఫోన్ లాక్కొని పారిపోయిన నిందితుడు... తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పరిచయస్తులే దాడికి పాల్పడ్డారా?

నటికి పరిచయస్తులే దాడి (attack on shalu Chourasia ) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ కొనసాగుతుండగానే.. పోలీసులు చౌరాసియా సెల్‌ఫోన్‌ పౌచ్‌ను అపోలో ఆస్పత్రి వద్ద గుర్తించారు. నిందితుడే అక్కడ పౌచ్‌ పడేసినట్లు భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌ పౌచ్‌ తనదేనని నటి (attack on shalu Chourasia ) గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫోన్ స్విచ్ ఆఫ్‌ చేసినట్లు గుర్తించారు. దోపిడీకా లేదా మహిళలే లక్ష్యంగా వచ్చాడా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. వారం వ్యవధిలో రెండు ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు... కేబీఆర్ పార్కు చుట్టూ భద్రత పెంచారు. ఎస్సై స్థాయి అధికారికి పార్కు వద్ద భద్రత పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు.

ఫోన్​ ట్రాక్​ చేస్తోన్న పోలీసులు

సినీ నటి చౌరాసియాపై దాడి (attack on shalu Chourasia) ఘటనలో నిందితులను పట్టుకునేందుకు నగర పోలీసు కమిషనర్​ అంజనీ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు లాక్కెళ్లిన ఐఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు దాదాపు నాలుగు గంటల పాటు కేబీఆర్‌ చుట్టుపక్కల ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో దాడి (attack on shalu Chourasia) జరిగిందని పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చారు. అగంతుకుడు ఆమెను కొట్టి చరవాణి లాక్కొని జీహెచ్‌ఎంసీ నడకదారి మీదుగానే జారుకున్నాడు. చౌరాసియా స్టార్‌బక్స్‌ హోటల్‌ సిబ్బంది సాయంతో తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఆసుపత్రికి వెళ్లారు. అగంతుకుడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1లోని బీవీబీ కూడలి, బాలకృష్ణ నివాసం ముందున్న గేటు నుంచి బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒంటి గంట ప్రాంతంలో చిచ్చాస్‌ హోటల్‌ ముందు నుంచి కేబీఆర్‌ ఉద్యానం వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తంగా రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకు నిందితుడు ఉద్యాన ప్రాంతంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

తెలిసిన వారి పనేనా..!

చౌరాసియాపై దాడి (attack on shalu Chourasia ) ఘటనలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారు, లేదా ఆమె ప్రతిరోజు ఒకే ప్రాంతంలో నడకకు ఒంటరిగా వస్తారని గుర్తించి దాడి (attack on shalu Chourasia) కి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ‘నిన్ను చంపకుండా నేను వెళ్లను..’ అంటూ అగంతుకుడు బెదిరించడం, కేవలం చరవాణి కోసం ఆమెపై దాడి (attack on shalu Chourasia )కి పాల్పడటం వంటి వాటిపైనా దృష్టి సారించారు.

అధికారుల పరుగులు..

కేబీఆర్‌ ఉద్యానవనం వెలుపల నడక దారిలో ఘటన (attack on shalu Chourasia ) నేపథ్యంలో అటవీ అధికారులు మంగళవారం ఉదయం ఉరుకులు పరుగులు పెట్టారు. పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి మరమ్మతులు చేయించారు. జీహెచ్‌ఎంసీ నడకదారిలో ప్రధాన ప్రాంగణానికి ఇరువైపులా దాదాపు 70 వీధి దీపాలు, పార్కింగ్‌ ప్రాంతాల్లో తొమ్మిది హైమాస్ట్‌ దీపాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: Attack on Actress: ఆ సినీనటిపై పరిచయస్తులే దాడి చేశారా?

Attack on Actress : కేబీఆర్​ పార్కులో వాకింగ్​కు వెళ్లిన నటిపై దాడి

Actress shalu chourasiya: 'కేబీఆర్​ పార్క్​లో లైంగిక దాడికి యత్నించాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.