ETV Bharat / crime

టీమిండియా స్టార్ క్రికెటర్​కు బెదిరింపులు... హైదరాబాదీ అరెస్టు

author img

By

Published : Nov 10, 2021, 4:28 PM IST

Updated : Nov 10, 2021, 5:12 PM IST

arrest
arrest

16:26 November 10

క్రికెటర్​కు బెదిరింపులు... హైదరాబాదీ అరెస్టు

క్రికెటర్‌ను బెదిరించిన కేసులో హైదరాబాద్‌ వాసిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ చేతిలో భారత్‌ ఓటమి తర్వాత ట్విటర్‌లో హైదరాబాద్​కు చెందిన రామ్​నగేశ్​ అనే వ్యక్తి అనుచిత పోస్టు చేశాడు. ప్రముఖ క్రికెటర్‌ను ఉద్దేశించి అసభ్య పోస్టు పెట్టడంపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రికెటర్‌ను ఉద్దేశించి కామెంట్‌ పెట్టిన వ్యక్తి హైదరాబాద్‌ వాసిగా గుర్తించారు. నిందితుడు రామ్‌నగేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు.  

ఇదీ జరిగింది..

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​, న్యూజిలాండ్​ చేతుల్లో ఓటమిని సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు. మ్యాచ్​ అనంతరం మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమికి.. మరో ప్రముఖ క్రికెటర్​ అండగా నిలిచిన ఫలితంగా బెదిరింపులకు గురికావాల్సి వచ్చింది. ఆ క్రికెటర్​ కుమార్తె ఫొటో విడుదల చేయాలని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ పలువురు హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమిషన్.  

భారత జట్టు పేలవ ప్రదర్శనకు.. క్రికెటర్ల  సతీమణులను గతంలో ట్రోల్​ చేసేవారు. ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకురావాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీచూడండి: కోహ్లీ పాత్రను తక్కువ చేయలేం: నెహ్రా

Last Updated : Nov 10, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.