వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి ఒక్కటవుదామనుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు... ప్రేమించిన అమ్మాయిని అతను మర్చిపోలేకపోయాడు. ఆమె అతన్ని విడిచి ఉండలేక పోయింది. దీనితో కనీసం చావులోనైనా కలిసి ఉందామనుకున్నారు. ఇంట్లోనే ఆ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం చోర్గాంలో చోటుచేసుకుంది. వీరి మృతితో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: