ETV Bharat / crime

ప్రేమ పెళ్లి వివాదం.. వరుడి వదిన మృతి - attacks on groom relatives

ప్రేమ పెళ్లి వ్యవహారంలో అబ్బాయి బంధువులపై అమ్మాయి వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో ఇది జరిగింది.

Love marriage dispute
Love marriage dispute
author img

By

Published : Jun 8, 2021, 9:48 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన యువతిని మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే నెపంతో.. యువకుడి కుటుంబంపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వరుడి వదిన.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: Murder:మంత్రగాడనే నెపంతో హత్య.. నిందితులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.