అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంటే.. మరొకరు కోమాలోకి వెళ్లేలా చేసింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో.. వేగంగా వచ్చిన ఓ లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇస్నాపూర్‌కు చెందిన జలీల్, రంజాన్లు.. పారిశ్రామికవాడ వైపునకు వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన రంజాన్‌ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: attack with knife: ప్రేమించలేదని ఉన్మాదం.. యువతిపై కత్తితో దాడికి యత్నం