ETV Bharat / crime

Friends Fun game: సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్​కు బాట - రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్

అర్ధరాత్రి నలుగురు మిత్రులు(Friends Fun game) సరదా కోసం చేసిన ఆట.. పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదయ్యేవరకు వెళ్లింది. ఆ నలుగురు రైండు బైక్​లపై ఓ లాఠీ చేతులో పట్టుకుని వాహనాలపై వీధుల్లో తిరిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ (balapur police station) పరిధిలో జరిగింది.

Fun game Trail to the police station
సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్​కు బాట
author img

By

Published : May 27, 2021, 9:53 PM IST

సరదా కోసం నలుగురు స్నేహితులు (Friends Fun game) కలిసి చేసిన గేమ్​ పోలీస్ స్టేషన్​లో కేసుకు దారితీసిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ (balapur police station) పరిధి షాహీన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాలాపూర్ బిస్మిల్లాహ్ కాలనీకు చెందిన ఎండీ ఇమ్రాన్, జిలానీ, సమీర్, ఇమ్రాన్ బిన్ అహ్మద్​లు కలిసి… రెండు బైక్​లపై ఓ లాఠీని చేతులతో పట్టుకుని లాక్​డాన్ నిబంధనలు అతిక్రమిస్తూ షాహీన్​నగర్ ప్రాంతంలో రాత్రి పూట వీధుల్లో తిరిగారు. వారిని చూసి ప్రజలు భయపడతారో లేదా అని తెలుసుకోవడానికి ఇలా చేశారని పోలీసులు పేర్కొన్నారు.

ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో(cc camera video) రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఓ లాఠీ, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సరదాగా తిరిగారని, ఎవరినీ బెదిరింపులకు గురి చేయలేదని, అలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని, వారిపై గతంలో కూడా ఎలాంటి నేర చరిత్ర లేదని సీఐ బి.భాస్కర్ వివరాలు వెల్లడించారు.

ఇదీ చూడండి: police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.