ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోసిగిలో రసాయన మందు అంటుకున్న నేరేడుపండ్లు తిని ఓ బాలుడు మృతి చెందగా.. ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. మహాదేవి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలతో పాటు ఆడుకునేందుకు వచ్చిన పక్కింటి బాలుడు శ్రీరాములుకు నేరేడుపండ్లు ఇచ్చింది. తిన్న కాసేపటికే ఆమెతో పాటు పిల్లలూ స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మహాదేవి అత్త నరసమ్మ పొలం నుంచి నేరేడుపండ్లు కోసుకుని.. వాటిని రసాయన ఎరువులు ఉన్న కవర్‌లో ఇంటికి తెచ్చింది. అది గమనించక మహాదేవి ఆ నేరేడుపండ్లను తినడంతో పాటు పిల్లలకూ ఇచ్చింది. ఈ క్రమంలోనే వారంతా స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మహాదేవి కుమారుడు హర్ష.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: