సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలంలో.. ద్విచక్రవాహనంను ఆటో ఢీ కొట్టింది. ఈ విషాద ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మద్దిరాల మండలం చిననెమిలకు చెందిన చాగంటి వెంకటయ్య, సుంచు సోమయ్యలు మరిపెడలో పనులు ముగించుకుని వస్తుండగా.. నూతన్‌కల్ మండలం దిర్శన్ పల్లి క్రాస్ రోడ్డు సమీపం వద్ద బైక్‌ను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోమయ్యకు తీవ్ర గాయాలవ్వగా.. వెంకటయ్య అపస్మారక స్థితికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు