ETV Bharat / crime

కరోనాతో నిన్న కొడుకు మరణం..నేడు తల్లి మృతి - కొవిడ్ మరణాలు

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. బోర్గం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు(65).. కొవిడ్​ లక్షణాలతో మృతి చెందింది. మృతురాలి కుమారుడు కరోనా బారిన పడి చనిపోయి.. 24 గంటలు గడవక ముందే ఈ ఘటన జరిగింది.

covid death rate telangana
కొవిడ్ మరణాలు
author img

By

Published : Apr 18, 2021, 3:38 PM IST

కరోనాతో కొడుకు మృతి చెందిన 24 గంటలలోపే.. లక్షణాలతో తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో చోటుచేసుకుంది. బోర్గం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (44) కరోనాతో నిన్న మృతి చెందాడు. జ్వరంతో బాధపడుతోన్న అతని తల్లి (65) నేడు ప్రాణాలు విడిచింది. కొవిడ్​తోనే ఆ వృద్దురాలూ మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్​ సెకండ్​ వేవ్​ నేపథ్యంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్​మెంట్ ఉంది: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.